Friday, May 24, 2024
- Advertisement -

బ‌న్నీ తో సినిమా అంటే పారిపోతున్న ద‌ర్శ‌కులు!

- Advertisement -

అల్లు అర్జున్ మెగా హీరోగా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైనా త‌న‌కుంటు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోగా మారాడు.అల్లు అర్జున్ సినిమాలు ఫ్లాప్ టాక్ వ‌చ్చిన క‌లెక్ష‌న్లు మాత్రం బాగానే వ‌సూలు చేస్తున్నాయి.దీనికి సాక్ష్యం దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్,స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు యావ‌రేజ్ టాక్‌తోనే క‌లెక్ష‌న్లు బాగానే వ‌చ్చాయి.

అయితే స్టార్‌డ‌మ్ వ‌చ్చిన త‌రువాత బ‌న్నీ బిహేవియ‌ర్‌లో చాలా మార్పులు వ‌చ్చాయ‌ని స‌మాచారం.ద‌ర్శ‌కుల‌కి స్వేచ్ఛ‌ని ఇవ్వ‌డం లేద‌ని,స్టోరీలో చాలా మార్పులు చెబుతున్నాడ‌ని తెలుస్తుంది.దాని ఫ‌లితంగానే నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ అయింద‌ని ఇండ‌స్ట్రీలో కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.నా పేరు సూర్య ఫ్లాప్ అయినప్ప‌టికి బ‌న్నిలో మార్పు రాలేద‌ట‌!విక్ర‌మ్ కుమ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బ‌న్నీ.

ఈ సినిమా క‌థ‌లో కూడా చాలా మార్పులు చెబుతున్నాడ‌ట‌.అందుకే సినిమా ఫైన‌ల్ కాలేద‌ని స‌మాచారం.ఇక కొర‌టాల లాంటి స్టార్ ద‌ర్శ‌కుడు కూడా బ‌న్నీతో సినిమా అంటే పారిపోతున్నాడ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా బ‌న్నీ కెలుకుడుని ఆపుతాడో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -