Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ని బన్నీ ఏం అన్నాడో తెలుసా?

- Advertisement -

ఇటివలే సినీ మా అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో మెగా స్టార్ చిరంజీవి డాన్స్ హైలేట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఏ పాత్ర అయిన అవలీలగా చేయగల సత్తా ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ సినీ మా అవార్డ్స్ వేడుకలో టెంపర్ సినిమాకి గాను ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది.

ఈ అవార్డ్ ను చిరంజీవి, నాగర్జున చేతుల మీదిగా అందుకున్నాడు ఎన్టీఆర్. అలాగే గోనగన్నారెడ్డి పాత్రకు గాను అల్లుఅర్జున్ కి జ్యూరీ అవార్డ్ లాభించింది. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన బన్నీ రియల్ టాలెంట్ అంటే అది కేవాలం ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటేనే రియల్ టాలెంట్.. ప్రస్తుతం ఉన్న హీరోలందరిలో బాగా కష్టపడి పైకొచ్చిన వారిలో ఒకే ఒక్కడు ఎన్టీఆర్.

నాకు చాలా మంచి స్నేహితుడు అని ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యాలు చేసాడు అల్లు అర్జున్. ఇలా ఎన్టీఆర్ పై అల్లు అర్జున్ ప్రశంసలు కురుపించడంతో మొదట అందరు షాక్ అయ్యారు. ఎందుకంటే నందమూరి హీరోలు మెగా క్యాంప్ హీరోలు పోటి పడుతునే ఉన్నారు. ఏది ఏమైన అల్లు అర్జున్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించడం బన్నీ ఫ్యాన్స్ ని అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సంతోష పెడుతుంది. ఇక ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించాడు. సో మొత్తానికి టాప్ హీరోల మధ్య ఇంత మంచి సన్నిహితం ఉండటం చాలా మంచిదే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -