Thursday, May 16, 2024
- Advertisement -

అలహాబాద్ లో బిజెపి కార్యవర్గ సమావేశం

- Advertisement -

దేశంలో ప్రజలకు సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారికి సేవ చేయడం, సమతుల్యం పాటించడం, ఎలాంటి పరిస్ధితులు ఎదురైనా సంయమనం పాటించడం, వారికి వీలైనంత సాయం చేయడం, సానుకూల ద్రక్పదంతో ఉండడం, సంవేదన, సంవాదం వంటివి ఇక నుంచి బిజెపి నినాదాలు కావాలని ఆయన అన్నారు.

గుజరాత్ లోని అలహాబాద్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలతో సప్తపది వంటి ఏడు అంశాలతో మమైకం కావాలని అన్నారు. ఇక ముందు నినాదాలు చేసి ఆకట్టుకోవాలంటే కుదరని పని, చేతనైనంత పని చేస్తేనే ప్రజలకు చేరువవుతామని ఆయన అన్నారు.

దేశంలో బలమైన జాతి నిర్మాణం చేయడమే లక్ష్యంగా పని చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ప్రజలకు బిజిపి పట్ల,  ఆప్రభుత్వం పట్ల ఎన్నో ఆశలు, కలలు ఉన్నాయని వాటిని నెరవేర్చాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరి మీదా ఉందని ప్రధాని అన్నారు. మంచి ప్రవర్తన, ప్రజలకు మంచి సేవ చేయడం ద్వారానే వారికి మరింత చేరువవుతామనే విషయాన్ని అందరూ గుర్తెరిగి పనిచేయాలని అన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేసుకోరాదని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా వారికి సేవ చేయాలని ఆయన అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -