Friday, May 17, 2024
- Advertisement -

ప్రభాస్ కోసం ఆగిన భారీ బడ్జెట్ సినిమా?

- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రభాస్ రెంజ్ అమాంతం అలా పెరిగిపోయింది. ఈ ఒక్క సినిమా ప్రభాస్ లైఫ్ నే పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఫ్రపంచవ్యాప్తంగా ప్రభాస్ మంచి క్రేజ్ సంపదించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి 2 షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా షూట్ చేసిన తర్వాత కూడా విడుదలకి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.  సో మొత్తాన్నికి బాహుబలి 2 వచ్చే ఇయర్ లో విడుదల చేయబోతున్నారు.

సో బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా పై ఇప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. రన్ రాజా రన్ సినిమాని తీసిన దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై ఇంకా ఎలాంటి అఫీషియల్ న్యూస్ రాలేదు. కాగా ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్ కి చాలా ఆఫర్లు వస్తున్నాయట. ఆఫర్లు వస్తున్న ప్రభాస్ మాత్రం ఏ సినిమాకి సైన్ చేయడం లేదట. బాహుబలి 2 రిలీజ్ అయ్యాకే ఏదైన అలోచిస్తాను అని చెబుతున్నాడట.

సో ఇలా ఆగిపోయిన సినిమాల్లో బిగ్గెస్ట్ బాలీవుడ్ ధూమ్ సిరీస్ 4 వ పార్ట్ కూడా ఉందట. ధూమ్ సిరీస్ కు ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. దూమ్ సంబంధించి వచ్చిన మూడు సిరీస్‍లు బంపర్ హిట్ కొట్టినవే. ఇప్పుడు తీయబోతున్న ధూమ్ 4 లో ప్రభస్ అయితే బాగుంటుందని అలాగే మంచి కలెక్షన్స్ వస్తాయి అని అలోచిస్తున్నారట. ప్రభాస్ ఈ సినిమా చేయడం పై ఇంక స్పందించకపోవడంతో బాహుబలి 2 అయ్యిపోయే వరకు వేట్ చేస్తాం అని ప్రభాస్ తో చెప్పారట. సో ప్రభాస్ లాంటి హీరో ధూమ్ సిరీస్ సినిమాలో నటిస్తే ఆ చిత్రం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -