పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఇద్దరి సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే బాక్స్ ఆఫిస్ బద్దలైపోవాల్సిందే. ఆ రెంజ్‍లో ఈ ఇద్దరి హీరోలకు పాలోయింగ్ ఉంది అభిమానులో. మెగాస్టార్ చిరు తర్వాత నెంబర్ వన్ హీరో ఎవరు అనేది సినీ పరిశ్రమలో ఎప్పుడు చర్చ జరుగుతునే ఉంటుంది.
ఇలాంటి చర్చ వస్తే ముందు ప్లేస్‍లో ఉండేది పవన్, మహేష్‍లే. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ రికార్డు సృష్టించాడు. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’తో రికార్డుల్ని తిరగరాశాడు. ఐతే ప్రస్తుతం వీళ్లిద్దరు చేస్తున్న సినిమాలపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని సమ్మర్‍లో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నాడు.
అలాగే మహేష్ బాబు కుడా తను ప్రస్తుతం చేస్తున్న బ్రహ్మోత్సవం సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని కూడా సమ్మర్‌లో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సమ్మర్‍లో వీళ్లీద్దరి సినిమాలో ఏ సినిమా ఏలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. ఇక మహేష్ బ్రహ్మోత్సవం తర్వాత సౌత్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఒకడైన అయిన మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.
ఇక పవన్ మాత్రం సర్దార్ సినిమా తర్వాత ఎస్.జే సూర్య దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే సూర్య పవన్‍కు పులి రూపంలో ప్లాప్ ఇచ్చాడు ఐన మరో సారి సూర్యకి ఛాన్స్ ఇచ్చాడు పవన్. మహేష్ టాప్ డైరెక్టర్స్‌ను చూసుకుంటుంటే పవన్ మాత్రం ప్లాప్ డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఇస్తున్నాడు. మరి ఎవరి సినిమా హిట్ అవుతుందో చూడాలి.
