Monday, May 20, 2024
- Advertisement -

అల్లు అర్జున్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడట!

- Advertisement -

అభిమానులు చిరంజీవి 150వ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటివలే గ్రాండ్ గా చిరు 150వ చిత్రం ”కత్తిలాంటోడు ” గ్రాండ్‍గా లాంచ్ అయింది. వినాయక్ దర్శకత్వంలో తెరకేక్కుతున్నఈ చిత్రాన్నికి రామ్ చరణ్ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే చిరంజీవి 150వ చిత్రం ”కత్తిలాంటోడు ” లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడట.

ఇటీవల సరైనోడు చిత్రంతో ఆకట్టుకున్న అల్లు అర్జున్ క్రేజ్ రోజు రోజుకి పెరిగి పోతుండటం తో బన్నీ ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి చిత్రాన్ని తెలుగులో వివివినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . ఆమధ్య పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలై లో సెట్స్ పైకి వెళ్లనుంది. 

మేనమామ చిరు అంటే అల్లు అర్జున్ కు ఎనలేని ప్రేమ అనే విషయం అందరికి తెలిసిందే. దాంతో ఈ 150వ చిత్రంలో తప్పకుండా ఏదో ఒక చిన్న రోల్ ఇచ్చినా ఫరవాలేదు అంటూ ఇప్పటికే బన్నీ కోరగా ఇదే కోరికతో మిగతా మెగా హీరోలు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళ విషయం ఎలా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఈ కత్తి లాంటోడు చిత్రంలో కనిపించడం ఖాయమట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -