Sunday, May 19, 2024
- Advertisement -

రోహిణీ కార్తె ప్రవేశం

- Advertisement -

మళ్లీ ఎండలు. నాలుగు రోజు పాటు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో సేద తీరిన ప్రజలకు రోహిణి కార్తె రూపంలో ఎండలు దంచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రోనూ తుపానుతో కాసింత చల్లబడినా..

ఆ ప్రభావం తెలంగాణపై చూపించినా అది కాస్తా తీరం దాటడంతో మళ్లీ ఎండలు తమ ప్రతాపం చూపుతున్నాయి. గడచిన నాలుగు రోజులుగా తెలంగాణ జిల్లాలు ఎండలతో భగభగమంటున్నాయి. మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సోమవారం నాడు కొత్తగూడెంలో అత్యధికంగా 51.5 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. రామగుండంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లో సోమవారం నాడు 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. మరో మూడు రోజుల పాటు వడగాలులు, ఉక్కపోత తప్పవని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా మహబూబ్ నగర్ లో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ నలభై డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎండలు కాల్చేస్తున్నాయి. ఎపిలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -