ఇంటర్నెట్ రాకతో ప్రపంచం మొత్తం కూడా ఓ కుగ్రామం అయిపోయింది. ఇప్పుడు ఇదే తెలుగు సినిమా కాపీ డైరెక్టర్స్‌కి శరాఘాతమైపోతోంది. ఖైదీ నాటి నుంచీ……అంతకుముందు కూడా కాపీలు మనకు కొత్తకాదు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమాని కాపీ సినిమాల విషయాలన్నీకూడా ఒరిజినల్ డైరెక్టర్స్‌కి తెలిసిపోతూ ఉండడంతో…..ఆ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ కేసులు వేస్తూ ఉండడంతో రిలీజ్‌కి ముందే పది కోట్లదాకా వదిలించుకోవాల్సిన పరిస్థితితో పాటు పరువు కూడా గంగలో కలిసిపోతోంది. అజ్ఙాతవాసి కాపీ చరిత్ర ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు ‘నా పేరు సూర్య’ సినిమా చరిత్ర చర్చనీయాంశం అవుతోంది.
నా పేరు సూర్య సినిమా హాలీవుడ్ ఫిల్మ్ Antwone Fisherకి ట్రూ కాపీనట. ఆ సినిమా ఒక ట్రూ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకుని తీయబడింది. ఫైండింగ్ ఫిష్ అనే బుక్‌లో వచ్చిన ఒక ట్రూ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ సినిమా తెరకెక్కించారు. ఇప్పుడు నా పేరు సూర్య సినిమా కథతో ఆ సినిమాకు చాలా పోలికలే కనిపిస్తూ ఉండడం గమనార్హం. తండ్రికి దూరమైన ఓ కుర్రాడు విషమ పరిస్థితుల మధ్య పెరుగుతాడు. ఆ తర్వాత ఓ గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి చేరదీసి ప్రయోజకుడిని చేస్తాడు. అయితే ఆ కుర్రాడికి అంతులేని ఆవేశం ఉంటుంది. ఆర్మీలో ఉన్న ఆ కుర్రాడు ఆ ఆవేశంతోనే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ ఆవేశాన్ని తగ్గించుకోమని చెప్పినా వినకపోవడంతో ఓ సైకియాట్రిస్ట్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. అయితే తెలుగు కథలో మాత్రం ఆ కుర్రాడి ఆవేశాన్ని తగ్గించడం కోసం డిఫెన్స్‌లో పెద్ద పోస్టులో ఉన్న అతని తండ్రి దగ్గరకే పంపిస్తారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే మాత్రం ఇంపాక్ట్ వీడియోలోనే రావు రమేష్‌తో ‘బోర్డర్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతాను గాడ్ ఫాదర్’ అని బన్నీ అనడం దగ్గర కూడా అసలు విషయం తెలిసిపోయేలా చేస్తోంది. మామూలుగా అచ్చతెలుగు డైలాగ్ అయితే మాత్రం ఆ గాడ్ ఫాదర్ అన్న ఎక్స్ప్రెషన్ వచ్చే అవకాశం అంతగా ఉండదు. ఇప్పుడు ఆ డైలాగ్ విన్నవాళ్ళే……కాపీ కొడితే కొట్టారు కానీ మరీ గాడ్ ఫాదర్ అన్న ఎక్స్ప్రెషన్ కూడా తీసుకురావాలా అంటున్నారు.
అయినా మన తెలుగు వాళ్ళ స్టైల్ అంతే కదా. ఏదైనా సినిమా రీమేక్ చేసినా యాజ్ ఇట్ ఈజ్‌గా షాట్స్‌తో కాపీ కొట్టే రకం డైరెక్టర్సే ఎక్కువ మంది. మరి ఈ నా పేరు సూర్య కాపీ కథ నిజాలేంటో…..ఈ సినిమాకు కూడా ఒరిజినల్ మేకర్స్ నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియాలంటే మాత్రం ఇంకాస్త వెయిట్ చెయ్యాల్సిందే.
