- Advertisement -

వైసీపీ ఖండువా క‌ప్పుకున్న‌ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి..

- Advertisement -

నెల్లూరు జిల్లాలో వైసీపీ ప‌ట్టు పెరుగుతోంది. గ‌త కొద్ది రోజులుగా జిల్లాకు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి వైసీపీలో చేరుతున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపించాయి. జగన్ 73వ రోజు పాదయాత్ర గూడూరులో జరుగుతున్నసమయంలో ఎట్ట‌కేల‌కు ప్ర‌భాక‌ర్‌రెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. జ‌గ‌న్ కండువాను క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ప్ర‌భాక‌ర్‌రెడ్డి చేరిక వ‌ల్ల పార్టీ బ‌ల‌ప‌డ‌టంలో సందేలేదు. అయితే ఆయ‌న చేరిక పార్టీకీ లాభ‌మా, న‌ష్ట‌మా అన్న చ‌ర్చ ముమ్మ‌రంగా జ‌రుగుతోంది. ఒకప్పుడు వైసిపిలోనే ఉండి 2014 ఎన్నికల్లోనే పరోక్షంగా వైసిపికి అండదండలు అందించిన వేమిరెడ్డి ఆ తరువాత సంభవించిన కొన్నిపరిణామాల కారణంగా మళ్లీ వైసిపిని దూరం పెట్టారు.

జిల్లాలో ప్ర‌భాక‌ర్‌రెడ్డికి మంచి పేరు… ధార్మిక కార్యక్రమాలతో…ధార్మిక కార్యక్రమాలతో…నెల్లూరు జిల్లాలోని మారుమూల గ్రామాలకు శుద్ధిచేసిన తాగునీటి వసతి కల్పించేందుకు సొంత నిధులతో ప్లాంట్లు, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

వైసిపికి దూరం అయిన త‌ర్వాత ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకొచ్చేంద‌కు టీడీపీ యువనేత నారా లోకేష్‌తో తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశారు. రాజ్య‌స‌భ సటు ఇస్తాన‌న‌డంతో టీడీపీలో చేరేందుకు ప్ప‌భాక‌ర్‌రెడ్డి రెడీ అయ్యారు. అయితే కొన్ని కార‌నాల‌వ‌ల్ల కర్నూలుకు చెందిన మాజీ మంత్రి టిజి వెంకటేష్‌కు ఇవ్వడంతో వేమిరెడ్డికి ఈసారి టిడిపి నుంచి మొండిచెయ్యి ఎదురైంది.

అప్ప‌టినుంచి ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అయితే వైకాపా నేతలు ఆయనతో అంతకంతకూ టచ్‌లోకి వెళ్లి ఆయన కోరుకుంటున్న హామీ ఇచ్చేందుకు సంసిద్దత కనబర్చి ఆయన తిరిగి వైకాపా చెంతకు చేరేందుకు సిద్ధపరిచారు. టిడిపి అభ్యర్థులతో వైసిపి అభ్యర్థులు ఆర్థికంగా పోటీపడి పైచేయి సాధించేంత సీన్ చాలా చోట్ల లేదు..కాబట్టి పార్టీలో ప్ర‌భాక‌ర్ చేర‌డం ఆపార్టీకి అర్థికంగా ఇబ్బందులు ఉండ‌క‌పోవ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -