Tuesday, May 6, 2025
- Advertisement -

మెగా హీరోల మల్టీ స్టారర్ !

- Advertisement -

సాయి ధరం తేజ హీరోగా పటాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సుప్రీం సినిమా రాబోతోంది. ఈ సినిమా కి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చాలా స్పీడ్ గా సాగుతూ ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయట పడింది.

ఇందులో సాయి ధరం తేజ తో పాటు అల్లూ శిరీష్ కూడా కనిపించ బోతున్నాడు అంటున్నారు. ఇద్దరు మెగా హీరోలు స్క్రీన్ మీద కనబడితే ఇక మెగా అభిమానులను ఆపడం ఎవరి వల్లా కాదు. ప్రస్తుతం ఈ సన్నివేశాలను షూట్ చేసే పనిలో ఉన్నారట చిత్ర యూనిట్.

 ఇక అల్లు శిరీష్ తాను హీరోగా పరశురాం దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

ఇప్పటి వరకూ ఏ  మెగా ఇద్దరు హీరోలూ ఇంత ఎక్కువ సేపు తెర మీద కనపడలేదు అనీ ఇది ఒక రకంగా మెగా మల్టీ స్టారర్ అనీ అంటున్నాయి యూనిట్ వర్గాలు. సుప్రీం సినిమా సంగతులు చూస్తే రాసీ ఖన్నా ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఇషా చావ్లా ఐటెం సాంగ్ చేస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -