Thursday, May 2, 2024
- Advertisement -

రాజకీయాల్లోకి త్రిష.. ఏ పార్టీలోకో తెలుసా..?

- Advertisement -

ఇప్పుడు బీజేపీ తమిళనాట రాజకీయాలపై కన్నేసినట్లు కనిపిస్తోంది. సినీ ప్రముఖులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నలు చేస్తోంది. రజినీ, కమల్ హాసన్ గురించి ప్రయత్నించి బిజెపి అధినాయకులు చివరకు విఫలమయ్యారు. కానీ ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సినీ ప్రముఖులు ఒక్కొక్కరిని తమవైపు తిప్పుకుని పార్టీని ముందుకు నడిపేందుకు.. ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నాయకులు.

తమిళనాడులో క్రేజ్ ఉన్న హీరోయిన్ త్రిష. 34 యేళ్ళ వయస్సుల్లోను యువ హీరోయిన్‌లా నటిస్తూ అందరినీ మెప్పిస్తోంది. ఇప్పుడు.. ఈ హీరోయిన్ ని బిజేపీలోకి లాగే తీసుకే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ అధినాయకులు. ఏకంగా అమిత్ షానే త్రిషకు ఫోన్ చేశారట. గత మూడురోజుల క్రితం చెన్నైలో ఉన్న త్రిషకు ఫోన్ వచ్చిందట. హీరోయిన్ ఫోన్లకు ఎవరో ఒకరు ఆకతాయి ఫోన్లు చేస్తుంటారని.. ఆమె ఫోన్ కట్ చేసిందట.

మళ్లీ తిరిగి అదే నెంబర్ నుంచి చాలాసార్లు కాల్ వస్తే ఫోన్ తీశారట త్రిష. నేను అమిత్ షా అంటూ ఇంగ్లీష్‌లో మాట్లాడడం ప్రారంభించారట. మీ సేవలు పార్టీకి అవసరం.. పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తామని చెప్పారట. అయితే త్రీష మాత్రం ఆలోచించి చెప్తా అని చెప్పిందట. ఇదే విషయం తన స్నేహితుల వద్ద కూడా మాట్లాడిందట. అయితే రాజకీయాలపై పెద్ద ఆసక్తి లేని ఈ హీరోయిన్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -