Monday, April 29, 2024
- Advertisement -

నిన్ను చూస్తారు.. మీ ఆయన్ని ఎందుకు చూస్తారు

- Advertisement -

హాట్ యాంకర్ అనసూయకున్న ఫ్యాన్స్ ఎంతమందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె కోసం షోలు చూసే జనాలున్నారు. ఇది గతమని ఈమధ్యనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కారణం..ఈమె గ్లామర్ రోజు రోజుకు షేఫ్ అవుట్ అవుతూ ఉండడం.అందుకే ఈమధ్య కొడితే సిక్స్ కొట్టాలని అనే తరహాగా నటిస్తుందనే వారు ఉన్నారు. తనకు ఎంతగానో కలిసొచ్చిన జబర్దస్త్ షోతో అమ్మడు మళ్లీ స్క్రీన్ పై తళతళమెరుస్తూ ఉంది.

సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటించిన అనసూయ ఇప్పుడు చెర్రీ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.సచ్చింది గొర్రె అనే చిత్రంలోనూ అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తోందట. ఇక అనసూయ వ్యక్తిగత జీవితానికి వస్తే ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలను అనసూయ భర్త ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ అనసూయ కెరీర్లో మరింత ముందుకు వెళ్లేందుకు సాయపడుతున్నారు. ఐతే అనసూయ యాక్టింగ్ చూశాక ఆమె భర్త సుశాంక్ కూడా యాక్ట్ చేయాలనే కోరిక కలిగిందట.

భర్త తన మనసులోని మాట చెప్పగానే అనసూయ ఇక ఎంతమాత్రం ఆలస్యం చెయ్యకుండా తనకున్న పరిచయాలతో భర్తను నటుడిగా చేయాలని నిర్ణయించుకుంది. మరి ఎలాంటి క్యారెక్టర్ చేస్తాడో కానీ త్వరలో అనసూయ భర్త కూడా అంజలా ఝవేరి భర్తలా నటుడి అవతారం ఎత్తుతారనే మాటు వినిపిస్తూ ఉన్నాయి. అంతా బాగానే ఉంది కాని అనసూయ మొగుడిలో ఏముందని ఆర్టిస్ట్ గా తీసుకోవాలి. అనసూయ కళ్లకు అతను మహేష్ బాబే కావచ్చు.. మన కళ్లకు కాదు కదా.ఈవిషయం అనసూయ తెలుసుకుంటే ఓకే. లేదంటే.. ఆ ట్రైల్స్ పడి తన కెరియర్ పాడుచేసుకుంటుందేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -