Sunday, May 19, 2024
- Advertisement -

ఆ టైమ్లో రేవంత్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలే సిఎంలు

- Advertisement -

కాంగ్రెస్ లో చేరాక యువనేత రేవంత్ రెడ్డి మాంచి దూకుడు మీదున్నాడు. అయితే ఆ దూకుడులో ఒక పద్దతి,లెక్కలు కనిపిస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోను టిడిపిలో మాదిరిగా మిగతా వారితో తగువులు పెట్టుకోకూడదని డిసైడ్ అయ్యారు రేవంత్ .అందుకే పక్కా వ్యూహంతో అన్నీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తో చెప్పే తన అడుగులు ముందుకు వేస్తున్నాడట. చివరకు కోమటిరెడ్డి టీంతో కూడా సఖ్యతగానే ఉంటూ ఉండడంతో రేవంత్ సేఫ్ గేమ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమైపోతుంది.

తాజాగా మధుయాష్కీ సైతం రేవంత్ దూకుడును మెచ్చుకోవడంతో రేవంత్ కు కాంగ్రెస్ లో బలం పెరిగిపోతుంది. జానా రెడ్డి కుమారులు ,సబితక్క కుమారులతో ముందు నుంచి దోస్తానా ఉండడంతో రేవంత్ కొచ్చిన నష్టం ఏం లేదు. వచ్చే ఎన్నికల్లో సిఎం అభ్యర్ధిగా రేవంత్ ను పెట్టినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని అంతా అంటున్నారు. ఎందుకంటే ఇపుడున్న వారిలో ఎవరిని పెట్టినా… ఓట్లు రాలే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్లో కనిపించడం లేదు.

అయితే ఈ టర్మ్ విషయంలో అధిష్టానం కూడా ఎప్పటిలాగానే తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధి ఫలానా అని చెప్పరనే విషయం అందరికీ తెలిసిందే. ఒకవేల అలా చెబితే గనుక ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే వారు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సారి జరిగే ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి అయితే రాదు గాని… సీట్ల సంఖ్యను మత్రం పెంచుకుంటుంది. 2024 ఎన్నికలకు మాత్రం తెలంగాణాలో రేవంత్ రెడ్డి..ఆంధ్రాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డిలకు జనాలు పట్టంకట్టొచ్చనే విధంగా పలువురు పొలిటికల్ క్రిటిక్స్ తమ ఒపీనియన్ చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -