Friday, May 10, 2024
- Advertisement -

బిగ్ బాస్ షోలోకి అనసూయ.. ఎందుకంటే..?

- Advertisement -

బిగ్ బాస్ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ప్రస్తుతం.. విజయవంతగా సాగుతోంది. ఇప్పటికే ఈ షోకి సంబంధించి రోజులు గడుస్తున్నాయి. గంట సేపు సజావుగానే సాగుతోంది కానీ.. ప్రేక్షకులను అలరించడంలో కాస్త వెనకపడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో  వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీద కొంత మందిని కొత్తగా లోపలకు పంపిస్తే తప్ప.. షోకి హుషారు రాదని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ జాబితా లిస్ట్ లో హీరోయిన్ మంచు లక్ష్మి, మరువాడ తేజస్వనిల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అయితే మంచు లక్ష్మికి సగం ఎపిసోడ్ లు అయ్యాక వెళ్తారని తెలుస్తోంది. ఇది ఎలా ఉంటే షోకి ఇప్పటికిప్పుడు మరింత జోష్ పెరగాలంటే మాత్రం తేజస్వి , లేదా అనసూయ లను పంపాల్సిందే అని అనుకుంటున్నారట. అయితే అనసూయ చాలా షోలకి యాంకరింగ్ చేస్తూ చాలా బిజీగా ఉంది. అందు వల్ల ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఒకవేళ అనసూయ ఒప్పుకుంటే.. వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -