Friday, April 19, 2024
- Advertisement -

రోజా అంటె బాబు అండ్‌ బ్యాచ్‌కు ద‌డ ఎందుకో తెలుసా..?

- Advertisement -

ఏపీలో అధికార ప‌క్షానికి ధీటుగా స‌మాధానం చెప్ప‌గ‌ల మ‌హిళా నాయ‌కురాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీలో ఉన్న‌ది ఎవ‌రంటె అది రోజానె. ఫైర్ బ్రాండ్‌గా ముద్ర‌ప‌డిన రోజా మాట‌ల తూటాల‌కు బాబునుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వ‌ర‌కు అంద‌రికీ గుండెల్లో రైల్లు ప‌రిగెడుతాయి. అధికార పార్టీ నాయ‌కుల‌కు ధీటుగా స‌మాధానం చెప్ప‌గ‌ల ధీర‌వ‌నిత రోజా.
రోజా దెబ్బ‌కు బాబు ప్ర‌భుత్వ‌మే దిగి వ‌చ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.. రాష్ట్రంలో మహిళలు ఏడుస్తున్నా కేవ‌లం క‌మీష‌న్ల కోసం వారిని ప‌ట్టించుకోకుండా ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ‘చంద్ర‌బాబుకి స్ప‌ష్టంగా చెబుతున్నా, ప‌ది రోజుల టైం ఇస్తున్నా.. రాష్ట్రంలో మ‌ద్యం ప్రవాహాన్ని ఆప‌క‌పోతే వైన్ షాపుల‌ను ధ్వంసం చేస్తాం’ అని రోజా హెచ్చ‌రించారు. మహిళ‌ల‌ను కూడ‌గ‌ట్టుకుని మ‌ద్యం షాపుల‌ను, బెల్టు షాపుల‌ను ప‌గ‌ల‌కొట్టేస్తామ‌న్నారు.
చంద్రబాబు సహా టిడిపి ఇటీవల పదేపదే బెల్టు షాపుల గురించి మాట్లాడుతోంది. అక్రమ బెల్టు షాపులను మూసేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కేబినెట్ సమావేశంలోని ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే, మద్యంపై వైసీపీ అధినేత జగన్ ప్రకటన, పది రోజుల్లో చర్యలు తీసుకోకుంటే తామే పగులగొడతామని రోజా హెచ్చరించినందు వల్లే టిడిపిలో కదలిక వచ్చిందన‌డంలో సందేహంలేదు.
ఇన్నాల్లు అక్ర‌మ బెల్ట్ షాపుల మీద నిర్వ‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన బాబుకు రోజా హెచ్చ‌రిక‌తో దిగిరాక త‌ప్ప‌లేదు. రోజాతో పాటు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అన్ని బెల్ట్ షాపుల‌ను మూసివేస్తామ‌ని జ‌గ‌న్‌కూడా ప్ర‌క‌టించారు. దీంతో బాబుకు చేసెది లేక బెల్ట్ షాపుల‌ను మూసివేయాల‌ని నిర్ణయంతీసుకున్నారు. రోజా అంటె ఎందుకు భ‌య‌మో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -