Friday, April 19, 2024
- Advertisement -

ఏపీలో భాజాపాకు అడ్డు తొల‌గింది… మిత్ర‌ప‌క్షం టీడీపీకి చుక్క‌లేనా….?

- Advertisement -

ఏపీలో చంద్ర‌బాబు నాయుడికి బ్యండ్ బాజా మోగ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్ష‌మే బాబును టార్గెట్ చేస్తె… ఇప్పుడు మిత్ర ప‌క్షం కూడా చుక్క‌లు చూపించ‌నుంది.ఇన్నాల్లు త‌న‌కు అండ‌గా ఉంటూ కాపు కాసె నాయ‌కుడు ఉప రాష్ట్ర‌ప‌తిగా వెల్ల‌డంతో మ‌రిన్ని స‌మ‌స్య‌లు త‌ప్పేట‌ట్టులేవు.
2014 ఎన్నికల్లో టీడీపీ,భాజాపా రెండు పార్టీలూ కలిసే పోటీ చేసాయి. కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. అయితే, అప్పుడప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై కొందరు భాజపా నేతలు ఒంటికాలిపై లేస్తుంటారు.రెండు పార్టీల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి అనుకున్నపుడు వెంకయ్య సీన్ లోకి వచ్చేవారు. ఇరువైపులా సర్దుబాటు చేసేవారు. దాంతో కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండేవారు.
చంద్రబాబుపై ఆరోపణలు చేసే భాజపా నేతల్లో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావులు ముందుంటారు. సోమువీర్రాజు, కన్నాలు చంద్రబాబుపైనే కాకుండా టిడిపి నేతలపైన కూడా ఓ రేంజిలో విరుచుకుపడుతుంటారు
చంద్రబాబు, టిడిపికి వ్యతిరేకంగా నలుగురు మాత్రం ఓ జట్టు. ఆ విషయం అందరికీ తెలిసిందే. గడచిన మూడేళ్ళలో చంద్రబాబుకు వ్యతిరేకంగా జాతీయ నాయకత్వానికి, కేంద్రప్రభుత్వానికి వీరు నలుగురు ఎన్నో నివేదికలు, ఫిర్యాదులు చేసారు. పై స్ధాయిలో వెంకయ్య ఉన్నారు కాబట్టి చంద్రబాబుకు ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా కాపాడుతున్నారన్నది బహిరంగ రహస్యం.
ఇటువంటి పరిస్ధితుల్లో ప్రత్యక్ష రాజకీయాల నుండి వెంకయ్యను బలవంతంగా పంపించేయటమంటే చంద్రబాబుకు, టిడిపికి బాగా ఇబ్బందే.ఏపీలో భాజాపా దూకుడుగా ఉన్న వెంక‌య్య అడ్డుతొల‌గ‌డంతో వీరి దూకుడును బాబు త‌ట్టుకుంటాడా అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -