Friday, May 17, 2024
- Advertisement -

నాగార్జున చేసిన పనికి బాధపడుతున్న అనసూయ !

- Advertisement -

యాంకర్ లలో కూడా హాట్ ఒరవడిని సృష్టించిన ఏకైక యాంకర్ అనసూయ అనే చెప్పాలి. యాంకర్స్ అంటే కట్టూ బొట్టూ అనుకుంటున్నా రోజుల్లో హాట్ గా కూడా ఉండాలి అని మొత్తం మార్చేసి యాంకర్ లేక్ కొత్త భాష్యం చెప్పింది ఆమె. ఈ భామ జబర్దస్త్ కామెడీ షోలో చేసిన స్కిన్ షో అంతా ఇంతా కాదు. ఆ స్కిన్ షో పుణ్యమే అమ్మడికి లెక్కలెనన్నీ షోలకి యాంకరింగ్ తీసుకొచ్చింది.

ఆమె టార్గెట్ ఎప్పటికైనా వెండితెర మీదనే అని ఎప్పుడూ చెబుతూ ఉండే అనసూయ మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో అత్తారింటికి దారేది లో ఓరి దేవుడో అనే పాటకి చాన్స్ వచ్చినా నో చెప్పింది తరవాత ఇన్నాళ్ళ కి సోగ్గాడే చిన్ని నాయనా సినిమా కి సంతకం పెట్టిన ఆమె ఈ సినిమా చేసినందుకు గాను తెగ బాధపడుతోందిట. నాగార్జున తో సహా డైరెక్టర్ కూడా ఈ సినిమాలో తనది ఇరవై నిమిషాల నిడివి గల పాత్ర అని చెప్పి కేవలం ఐదు నిమిషాలకే పరిమితం చేసారు అనీ అందరూ తనని మోసం చేశారూ అనీ లబో దిబో అంటోంది.

నిజానికి అనసూయ మీద పెద్ద ఎపిసోడ్ లు తీసారు కానీ అవి ఎడిటింగ్ లో పోయాయట పాపం. నాగార్జున ని నమ్ముకుని ఇలా చేస్తే మోసం చేసారు అని తెగ బాధ పడుతోంది. టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చెయ్యడం లో నాగ్ కి తానే సాటి కళ్యాన్ కృష్ణ లాంటి కొత్త డైరెక్టర్ తో సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ కొట్టారు అంటే ఆయనకే చెల్లింది. కాబట్టి కాస్త ఓపిక పడితే అనసూయ కి కూడా మంచి అవకాశం ఇచ్చి ఇండస్ట్రీ లో నిలదోక్కునేలా చేస్తారు సహనం ఉండాలి కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -