మహేష్ బాబు హీరోగా తెరకేక్కుతున్న చిత్రం ‘బ్రహ్మెత్సవం’ ఈ సినిమాని పీవీపీ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సంస్థ అనుష్కతో రెండు సినిమాలు తీసింది. అందుల్లో ఒకటి ‘వర్ణ’ కాగ మరోటి ‘సైజ్ జీరో’. వర్ణ సినిమా భారీగా రిలీజ్ అయ్యి భారీగానే నష్టపోయింది. దాని వల్ల ఈ సంస్థకి భారీగా నష్టం వచ్చింది.
ఇటీవలే వచ్చిన ‘సైజ్ జీరో’ చిత్రం కూడా ప్లాప్ కావడంతో పీవీపీ మరోసారి నష్టపోయింది. ఈ సినిమాలకు మంచి క్రేజ్ ఉండటంతో శాటిలైట్ రైట్స్ అమ్మకుండా అలానే ఉంచారు. తీర సినిమాలు ప్లాప్ కావడంతో ఈ సినిమాల శాటిలైట్ రైట్స్ కొనడానికి ఎవరు ముందుకు రావడంలేదు.
ఐతే మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా విడుదల కాకముందే శాటిలైట్ రైట్స్ కొనడనికి ఛానెళ్లు పోటీ పడుతున్నాయి. మహేష్‌కు ఉన్న క్రేజ్‍ను ఉపయోగించుకొని బ్రహ్మోత్సవం కొంతే వర్ణ, సైజ్ జీరో సినిమాలు కూడా కొనాలి అని అంటున్నారట పీవీపీ సంస్థ నిర్మాతలు. సో అమ్ముడుపోని సినిమాలను మహేష్ సినిమాని వాడుకొని వదిలించుకుంటున్నారు.
