Saturday, May 18, 2024
- Advertisement -

మహేష్ కి చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్ ?

- Advertisement -

ఎంత కాంపిటీషన్ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ తన రికార్డుల సృష్టి లో తాను బిజీ గా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఓవర్ సీస్ లో కూడా ఎన్టీఆర్ తన సత్తాని చాటుతున్నాడు. డైరెక్టర్ సుకుమార్ కావడం పూర్తి ఏ క్లాస్ సినిమా తీయడం తో ఎన్నారై లకి ఈ సినిమా బాగా ఎక్కేస్తోంది.

సీడెడ్ లో కలక్షన్ ల వరద పారించడం లో ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ సాటి కానీ ఈ దఫా ఈ రేంజ్ వసూళ్లు ఓవర్ సీస్ లో వస్తున్నాయి.  సుకుమార్ సృష్టించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఎన్టీఆర్ కి కావలసినంత పెద్ద హిట్ నే అందించింది. టాక్ మొదటి రోజు నుంచీ మిక్స్ గా వచ్చినా చివరకి కలక్షన్ లు మాత్రం భారీ స్థాయిలో వస్తున్నాయి.

మంగళవారం రిలీజ్ కావడం ఈ సినిమాకి ప్లస్ అవుతోంది. దాదాపు వరసగా ఆరు రోజుల పాటు కలక్షన్ లు స్టడీగా వస్తుండడం పెద్ద అచ్చీవ్ మెంట్.శుక్రవారం నాడు యూఎస్ లో 263983 డాలర్లు వసూలవగా శనివారానికి 375184 డాలర్లు వచ్చాయి. ఇప్పటి వరకూ ఒకటిన్నర బిలియన్ పైగా గ్రాస్ రూపంలో వచ్చింది. ఆరున్నర మిలియన్ డాలర్ లతో బాహుబలి మొదటి స్థానం లో ఉండగా శ్రీమంతుడు రెండున్నర మిలియన్ లతో రెండవ స్థానం లో నిలిచింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -