Friday, May 10, 2024
- Advertisement -

ఈ వీడియో చూడండి: ఈ చిన్నారి రోజూ నిద్ర లేని రాత్రులు గడుపుతోంది.

- Advertisement -

ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది రైతులు సకాలంలో వర్షాలు రాక, గిట్టు బాటు ధర లేక అప్పుల పాలై చనిపోతున్నారు. ఇండియా మొత్తం మీద కేవలం 2012 లోనే 13,754 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్‌లో  నమోదు అయింది.

రైతులు అత్మహత్యలను అరికట్టేందుకు skymetweather.com అనే వెబ్‌ సైట్ తన వంతు ప్రయత్నం చేసింది. దీనికోసం ఒక వీడియోను రూపొందించి రైతులలో ఉత్సాహాన్ని నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. ఒక చిన్నారి రోజూ వాళ్ళ నాన్న పొలం మీదికి వెళ్ళే తీరును గమనిస్తూ ఉంటుంది. కానీ రోజూ రాత్రి మాత్రం భయంతో నిద్రపోదు. అందరూ నిద్రపోతున్నా కూడా ఆ అమ్మాయి అలానే మేల్కొని ఉంటుంది.

ఎందుకంటే తన నాన్న కూడా వాళ్ళ ఫ్రెండ్స్ నాన్నలు, ఎలాగైతే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారో అదే విదంగా తన నాన్న కూడా చనిపోతాడేమోనన్న భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటుంది. ఆ చిన్నారి ఫ్రెండ్స్ ఫాదర్స్ కూడా రైతులుగా ఉండి, బాగా నష్టాల పాలై ఆత్మహత్యకు పాల్పడినవారు కావడంతో తన నాన్న కూడా అలా చేసుకుంటాడేమోనన్న భయం రోజూ తనను వెంటాడుతూ ఉంటుంది.

రోజూ తన ఇంట్లో ఉన్న తాడును దాచిపెడుతూ ఉంటుంది. కాని ఒకరోజూ తాడు అక్కడ కనిపించదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.

watch video:

{youtube}Qfs_mvpA-vQ{/youtube}  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -