Tuesday, May 6, 2025
- Advertisement -

ఢీ నుంచి తప్పుకున్న యాంకర్ ప్రదీప్..?

- Advertisement -

బుల్లితెరపై ఎన్ని షోస్ ఉన్నప్పటికి ఢీ, జబర్దస్త్ షోలకు ఉన్న క్రేజ్ వేరే. వాళ్లు చేసే కామెడీ, డాన్స్ అద్భుతం అని చెప్పాలి. జబర్దస్త్ కు అనసుయ, రష్మీ ఎంత అందమో.. అలానే ఢీ షోకి యాంకర్ ప్రదీప్ అంతే అందం. ఆయన యాంకర్ గా చేస్తూనే ఎంతో కామెడీ చేస్తాడు. ఢీనే కాదు గతంలో పలు టీవీ షోలలో ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరించినప్పటికి.. అతని ఢీ షో ద్వారానే ఎక్కువగా పేరు వచ్చింది.

ఇటు స్టేజ్ పై తోటి సభ్యులు .. అటు ఆడియన్స్ ఎవరూ హర్ట్ కాకుండా మంచి సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయడంలో ప్రదీప్ దిట్టా. అలాంటి ప్రదీప్ కి మంచి క్రేజ్ ఉంది. అతని కోసం చాలా షోస్ వేచి చూస్తున్నాయి. అయితే ‘ఢీ’ షో నుంచి ప్రదీప్ తప్పుకున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. వచ్చేవారికి సంబంధించిన ప్రోమోలో ప్రదీప్ కనిపించకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ప్రదీప్ హీరోగా ఒక సినిమా రూపొందనుంది. ఆ సినిమా షూటింగు కారణంగానే ఆయన ఈ షో నుంచి తప్పుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ వెండితెరపై చిన్నచిన్న పాత్రలతో మెరుస్తూ వచ్చిన ప్రదీప్, త్వరలో హీరోగా ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఇక ఇటీవలే జబర్దస్త్ కమెడీయన్ సుడిగాలి సుధీర్ హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

https://www.youtube.com/watch?v=7q_d6QaHLck

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -