ఢీ నుంచి సుధీర్, రష్మి అవుట్..కారణం అదేనా

- Advertisement -

తెలుగులో డాన్స్ ప్రోగ్రాం ‘ఢీ’కి ఉన్న ఆదరణ అంతా ఇంతాకాదు. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డాన్స్ షోగా దీనికి గుర్తింపు ఉంది. ప్రభుదేవా సమర్ఫణలో వచ్చిన ఈ కార్యక్రమం అనతి కాలంలోనే అత్యంత ప్రేక్షకాదరను పొందింది. ఇప్పటి వరకు 13 సీజన్లను ఈ షో పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్లో న్యాయమూర్తిగా టాలీవుడ్ హీరోయిన్ రంభ వ్యవహరించారు. చాలాకాలం న్యాయమూర్తులుగా శేఖర్ మాస్టర్, ప్రియమణి, సదా వ్యవహరించారు. తర్వాత పూర్ణ చేరారు.

తాజాగా శేఖర్ మాస్టర్ స్థానంలో గణేష్ మాస్టర్ కనిపిస్తున్నారు. ఒక్కో సీజన్ కు ఒక్కోలా ప్లాన్ చేయడం ఈ షో ప్రత్యేకత. డాన్స్ తోపాటు ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసం వినోదాన్ని ఇందులో జోడించారు. ఇందుకోసం 9వ సీజన్లో జబర్దస్త్ కమెడియన్ ను సుధీర్ నురంగంలోకి దింపారు. అనంతరం సుధీర్ సరసన రష్మి గౌతమ్ ను దింపారు. లవర్ పేర్ గా గుర్తింపున్న ఈజంట డాన్స్ మధ్యలో చేసే కామెడీకి మంచి క్రేజ్ వచ్చేది.

- Advertisement -

12 వ సీజన్లో వీరికి జోడీగా మరో జబర్దస్త్ కమెడియన్ ఆదిని తీసుకొచ్చారు. ఆదికి జోడీగా వర్షిణిని తీసుకొచ్చారు. ఆది, సుధీర్ల జోడీ చేసే కామెడీ షోకే హైలెట్ గా నిలిచేది. ప్రస్తుతం ప్రసారం అవుతున్న 14వ సీజన్లో సుధీర్,రష్మిలు కనబడడం లేదు. వీరి స్థానంలో బిగ్ బాస్ ఫేం అఖిల్ కనబడుతున్నాడు. సుధీర్ రష్మిల కామెడీ హైలెట్ గా నిలిచేది. కాగా వీరు షోలో కనబడకపోవడంపై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ , ఢీ లను నిర్మాణ సంస్థ మల్లెమాల ఒకటే కావడంతో వీరిని కావాలనే ఈ షో నుంచి తప్పించారని వదంతులు వినిపిస్తున్నాయి. కాగా సినిమాల్లో ఇద్దరూ బిజీగా ఉండడం కారణంగానే ఢీని వదులుకున్నట్లు వీరి సన్నిహితులు చెబుతున్నారు.

సమంత ఎలా ఊ.. అందో తెలుసా?

నేరస్తుణ్ని ఇలా కూడా పట్టుకుంటారా?

ఎన్నికలని ఆపలేని ఒమిక్రాన్‌

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -