Sunday, May 5, 2024
- Advertisement -

హైపర్ ఆదికి హ్యాండ్ ఇచ్చిన యాంకర్ వర్షిణి..!

- Advertisement -

బుల్లితెరపై తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాధించుకున్నాడు కమెడియన్ హైపర్ ఆది. జబర్దస్త్ లో టాప్ లీడర్ గా కొనసాగుతున్నాడు. తనదైన పంచ్ డైలాగులతో పొట్టచెక్కలయ్యే కామెడీ చేసే హైపర్ ఆది.. ఇప్పుడు సినీ నటుడిగా, యాంకర్‌గా కూడా రాణిస్తున్నాడు. ఇలాంటి సమయంలో తనతో పాటు చేస్తున్న ఓ లేడీ యాంకర్ ఆయనకు హ్యాండిచ్చిందనే వార్తలు తెరపైకి వచ్చాయి.

విషయంలోకి వెళ్తే.. హైపర్ ఆది ఈ మధ్య కామెడీతో నవ్విస్తూనే తనలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ ని కూడా చూపిస్తున్నాడు. ‘ఢీ’ ప్రోగ్రాంలో యంగ్ యాంకర్ వర్షిణితో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నాడు హైపర్ ఆది. ఆమెతో కలిసి మనోడు చేస్తున్న రొమాంటిక్ డ్యూయెట్స్ అబ్బో! అనిపిస్తున్నాయి. సుధీర్, రష్మీలకు ధీటుగా మనోడు రొమాన్స్ పండిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దాంతో హైపర్ ఆది, వర్షిణిల క్రేజ్ మరింత పెరిగింది.

సరిగ్గా ఈ పరిస్థితుల్లో యాంకర్ వర్షిణి హైపర్ ఆదికి హ్యాండిచ్చిందని తెలుస్తోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ‘ఢీ’ ఎపిసోడ్స్ షూటింగ్స్ ఆగిపోయాయి. కొత్త సీజన్ స్టార్ట్ కావాలంటే కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఆది జోడీ వర్షిణికి కొత్త వెబ్ సిరీస్‌లలో అవకాశాలు వస్తుండటంతో బిజీ అవుతోంది. ఈ నేపథ్యంలో హైపర్ ఆదితో మరోసారి జోడీ కట్టేందుకు వర్షిణి కాస్త ఆలోచనలో పడినట్లు టాక్ నడుస్తోంది. ఇది జరిగితే ఆద్ రొమాంటిక్ యాంగిల్ కు బ్రేకులు పడినట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -