Sunday, May 5, 2024
- Advertisement -

చంద్రబాబుతో రేవంత్ రహస్య భేటీ?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ముఖ్యనేత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…టీడీపీ అధినేత చంద్రబాబును కలినట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీ స్కిల్ స్కాంలో మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు ఉండగా ఆయన్ని పరామర్శించడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే జనసేన – బీజేపీ కూటమికి మద్దతిస్తారని ప్రచారం జరిగిన చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌కు జై కొట్టారు. సెటిలర్ల ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మరల్చడంతో పాటు తన శిష్యుడుని సీఎంగా చేసేందుకు ఇది దోహద పడుతుందని బాబు భావించారని సమాచారం.

ఇటీవలె అర్థరాత్రి వేళ ఈ భేటీ జరుగగా ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో రేవంత్‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేశారని టాక్. ఇక వీరిద్దరి భేటీ జరిగిందన్న వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలో అది టీడీపీకి ప్లస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారట. మొత్తానికి తెలంగాణ ఎన్నికల రేసు నుండి తప్పుకున్న టీడీపీ… కాంగ్రెస్ గెలుపుకోసం ఇకపై బహిరంగంగానే ప్రచారం నిర్వహించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -