Thursday, May 16, 2024
- Advertisement -

చిరంజీవితో అనుష్క ఫిక్స్‌?

- Advertisement -

మెగాస్టార్ ప్ర‌స్తుతం ‘సైరా మూవీతో బిజీగా ఉన్నాడు.స్వాతంత్య్ర ఉద్య‌మకారుడైన ఊయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమాకు తెర‌కెక్కుతుంది.ఈ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.ఇప్ప‌టికే స‌గం షూటింగ్ పూర్తి అయింది. ఆ సినిమా త‌రువాత కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు చిరంజీవి.అందుకు సంబంధించిన పనుల్లో కొరటాల బిజీగా వున్నారని అంటున్నారు.ఈ సినిమాలో చిరంజీవి ప‌క్క‌న హీరోయిన్‌గా అనుష్క తీసుకున్నార‌ని స‌మాచారం.

హీరోయిన్‌గా చాలా మంది పేర్లను ప‌రిశీలించిన‌ప్ప‌టికి అనుష్క అయితే ఫ్రెష్‌గా బాగుంటుంద‌ని కొర‌టాల శివ భావించారు.అందువలన ఆమెను తీసుకోవడమే కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చేసి సంప్రదింపులు జరుపుతున్నారు. దాదాపుగా ఆమె ఎంపిక ఖరారైనట్టేనని అంటున్నారు.సైరా సినిమా పూర్తి కాగానే కొర‌టాల మూవీకి షిఫ్ట్ అవుతాడు చిరంజీవి.సైరా మూవీలో హీరోయిన్‌గా న‌య‌న‌తార న‌టిస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -