Wednesday, May 15, 2024
- Advertisement -

అనుష్క ను అలా చూపించడం కోసం.. 5 కోట్లు..?

- Advertisement -

బాహుబలి సినిమా తర్వాత అనుష్క స్థాయి మరింత పెరిగింది. ప్రస్తుతం ఆమె టలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మూడు పదుల వయసు దాటినా కూడా అందంలో ఏ మాత్రం తగ్గలేదు ఈ బ్యూటీ. అయితే బాహుబలి తర్వాత ఇంతవరకు ఒక్క మూవీ కూడా అనుష్కది రిలీజ్ కాలేదు.

ప్రస్తుతం భాగుమతి అనే ఒక్క మూవీతో బిజీగా ఉంది ఈమె. పిల్ల జమిందార్ డైరెక్టర్ జి. అశోక్ ఈ భాగుమతి ని తెరకెక్కిస్తున్నాడు. విజువల్ వండర్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. అయితే సినిమా ఎప్పుడో మొదలు అయింది. షూటింగ్ కూడా దాదాపు కంప్లీట్ అయింది. ప్రస్తుతం డైరెక్టర్ గ్రాఫిక్స్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. యువి క్రియేషన్స్ ఆ సినిమాను తెరకెక్కిస్తోంది. అయితే మూవీకి బడ్జెట్ ఊహించిన దానికంటే ఎక్కువనే ఖర్చయిందట. అలానే గా అనుష్క ఫిట్ నెస్ లోపం వల్ల సినిమాకి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఆమె శరీర ఆకృతిని గ్రాఫిక్స్ తో అందంగా కనిపించేలా కవర్ చేసినట్లు తెలుస్తోంది.

కేవలం అనుష్క లుక్ కోసమే నిర్మాతలు 5 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. అయితే డైరెక్టర్ ఇంతవరకు సినిమాకి సంబంధించిన ఒక్క లుక్ ని కూడా రెడీ చెయ్యలేదు. అసలు అ మూవీ ఉందా ఆగిపోయిందా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సినిమా అయితే రెడీ అవుతోందని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో అయినా చెప్తారా లేక డైరెక్ట్ గా రిలీజ్ చేస్తారా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -