Wednesday, May 15, 2024
- Advertisement -

ఇన్నాళ్లకు గుర్తొచ్చారా.. బాబు గారూ!

- Advertisement -

ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు.. అప్పుడప్పుడూ కొందరు తన దయాదాక్షిణ్యాలపైనే బతుకు వెళ్లదీస్తున్నారని.. రానున్న కాలంలో తను కొందరికి మా గొప్ప మేలు చేయబోతున్నాననీ కలరింగ్ ఇస్తున్నట్టే చెబుతుంటారు. ఇప్పుడు రీసెంట్ గా.. ముస్లిం సోదరులకు మంత్రి పదవిపై ఆయన చేసిన కామెంట్ కూడా ఇలాగే కనిపిస్తోంది కొందరికి.

ఇంతకీ విషయం ఏంటంటే.. త్వరలోనే కేబినెట్ లో ముస్లిం నాయకుడిని చూస్తారు.. అని ఈ మధ్య బాబు గారు సెలవిచ్చారు. ఇదే విషయం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. మంత్రి వర్గ విస్తరణ ఖాయమన్న సంకేతాన్ని చెప్పకనే చెప్పిన చంద్రబాబు.. ముస్లిం నేతకు సీటు ఇస్తానని చెప్పడం వెనక.. ఎవరి సీటుకు ఎసరు ఉందో అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి.

ఈ చర్చలు పక్కన పెడితే.. బాబు గారికి ఇంత సడన్ గా ముస్లింలపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో అర్థం కావడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉన్న నాయకుడే అయితే.. ముస్లిం నాయకుడికి ఈ పాటికే కేబినెట్ లో మంచి పదవి ఇచ్చి గౌరవించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నిజంగానే తప్పు చేశారని కామెంట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -