Saturday, May 18, 2024
- Advertisement -

సైజ్ జీరో సినిమా తన జీవితం లో చేసిన పెద్ద తప్పుగా ఫీల్ అవుతున్న స్వీటీ ?

- Advertisement -

సగటు తెలుగు ప్రేక్షకుడిని ఇప్పుడు ఉన్న హీరోయిన్ లలో టాప్ no 1 ఎవరు అంటే టక్కున అనుష్క పేరే చెబుతారు. అనుష్క తన విభిన్న కథలతో, విభిన్న రీతి తో అలరిస్తోంది. ఆమె కోసం ఇప్పుడు బాహుబలి 2 లో భారీ యుద్ధాలు సిద్దం అవుతూ ఉండగా ఈ మధ్యన ఒచ్చిన సైజ్ జీరో మీద చాలా ఆశలు పెట్టుకున్న స్వీటీ బొక్క బోర్లా పడింది.

 సహజంగా ఏ సినిమా కైనా స్వీటీ సంతకం పెట్టాలి అంటే గనక కనీసం రెండు కోట్లు చేతిలో పెట్టి ఆ తరవాత ఆమె కి సినిమాలో పాత్రని చాలా ముఖ్యమైంది ఇవ్వడం జరగాలి. ఒబేసిటీ తో బాధపడే అమ్మాయి పాత్రలో అనుష్క ఇరగదీసిన సినిమా సైజ్ జీరో. సినిమా కోసం మొదటి  నుంచీ స్వీటీ చాలా కష్టపడింది. తెరమీద ఆమె కష్టం అంతా కనపడింది. కానీ ఫలితం మాత్రం ఆమెకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. 

ఎందుకంటే అన్ని సినిమాల లాగా అనుష్క ఈ సినిమాకి డబ్బులు తీసుకోలేదు. రూపాయి కూడా తీసుకోకుండా సినిమా కథని నమ్మి సినిమా అంగీకరించిన స్వీటీ ఆఖర్లో కలక్షన్ లలో కొంత మొత్తం తీసుకోవడానికి అంగీకారం తెలిపింది. కానీ సినిమా మాత్ర దారుణమైన లాస్ ని ఇచ్చింది.

పైగా ఆమె ఇప్పుడు ముప్పై కేజీల అదనపు బరువుతో ఉంది సో బాహుబలి 2 కోసం వెయిట్ తగ్గాలి . ఒక పక్క పారితోషికం రాక, బరువు పెరిగి తన జీవితం లో చేసిన పెద్ద తప్పుగా ఈ సినిమా తీయడాన్ని గురించి స్వీటీ తనవారి దగ్గర వాపోయింది అని భోగట్టా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -