హీరోయిన్ అనుష్క భాగమతి హిట్‌తో మంచి జోష్‌లో ఉంది.కాని సినిమాలలో అవకాశాలు మాత్రం రావడం లేదు.అయితే ఓ సినిమాలో అవకాశం వచ్చిందని వినికిడి. ఆ సినిమానే ‘మహానటి’.అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తి సురేశ్ సావిత్రి పాత్రలో నటిస్తున్నారు.సమంత జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నారు.మోహన్‌బాబు, ప్రకాశ్ రాజ్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, విక్రమ్ ప్రభు, షాలిని పాండే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు.నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఇందులో అనుష్కకి ఓ అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.అలనాటి నటి భానుమతి పాత్రలో ‘భాగమతి’ అనుష్క శెట్టి నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక సినిమాలు చేసిన నటీమణుల్లో సావిత్రి, భానుమతిలు కూడా ఉన్నారు. ఆమె పాత్రలో అనుష్కనే సరిపోతారని చిత్రబృందం భావించిందట. అయితే ఈ పాత్రకు అనుష్క ఒప్పుకుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.