Wednesday, May 15, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి హీరోయిన్ ను ఇంట్లోనుంచి వెళ్ళాగొట్టారు..?

- Advertisement -

అర్జున్ రెడ్డి.. యువతను బాగా ఆకట్టుకున్న సినిమా. అయితే ఈ సినిమా కొందరికి నచ్చడం లేదు. ఈ సినిమా చూసి తమ పిల్లలు తప్పు దోవ పట్టే ఛాన్స్ ఉందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసభ్యతను పెంచిపోషించేలా ఈ మూవీ ఉందని,ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు సైతం రోడ్డెక్కి ఆంధోళన చేసిన విషయం తెలిసిందే.

అయితే దీనిపై.. కొందరు మద్దతు తెలిపినా.. మరికొందరు మాత్రం వ్యతురేకతనే చూపిస్తున్నారు. ఇక సినిమా పోస్టర్ లో ఉన్న లిప్ లాక్ ద్వారా మొదలైన వివాదంతో పబ్లిసిటీ మాత్రం ఫుల్లుగా వచ్చింది. ఇక సినిమాలోనూ హీరోయిన్, హీరోల మధ్య అనేక ముద్దుసీన్లు ఉండటం కూడా యువతను బాగా ఆకట్టుకుంటుంది. కానీ ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ షాలిని కూడా బాగానే ఇబ్బంది పడుతుంది. సినిమా సక్సెస్ సందర్భంగా ఓ షోలో మాట్లాడుతూ.. తన పర్సనల్ విషయాలు వెల్లడించింది ఈ భామ. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగని తెలిపింది. అతనికి ఈమె సినీ ఇండస్ట్రీకి రావటం ఇష్టం లేదట. కానీ ఆమెకు సినిమాలు అంటే ఇష్టంతో.. ఇందులో అడుగుపెట్టిందట.

పేరంట్స్ మాటను ఎదురించి.. అవకాశాలు దక్కించుకుంది. తమ మాట వినకపోవడంతో షాలినిపై ఆమె తండ్రి ఆగ్రహం వ్యక్తం చేసాడట. ఒక టైంలో తండ్రిపై కేసు పెట్టెందుకు కూడా షాలిని రెడీ అయిందట. ఇక అప్పటి నుండి ఆమెతో తల్లిదండ్రులు మాట్లాడం మానేశారట. ఇక ఎలాంటి సంబంధం లేదని దూరం పెట్టారట. దాంతో తన ఫ్రెండ్స్ సహాయంతో సినిమాలో అవకాశం దక్కించుకున్నాని చెప్పింది. ఇక ఇప్పటికి ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడం లేదని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -