Tuesday, May 21, 2024
- Advertisement -

నంద్యాల, కాకినాడ ఓటమికి కారణం ఏంటి..?

- Advertisement -

నంద్యాలలో.. భూమా కుటుంబాన్ని.. ఏకగ్రీవంగా గెలిపించాలని.. టీడీపీ కోరిన అది తమ స్థానం అని జగన్ మాట్లాడుతూ.. నంద్యాల ఉపఎన్నికల్లో.. టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి, అక్రమాలకి ప్రజలు రాళ్ళతో అతనికి స్వాగతం పలకాలని విమర్శలు చేస్తూ ఎలా యిన గెలవాలని, తమదే గెలుపు అంటూ ప్రచారం టైంలో జగన్ చెప్పాడు.

అయితే అనుకోని విధంగా.. నంద్యాలలో భారీ తేడాతో వైసీపీ అభ్యర్ధి టీడీపీ మీద ఓడిపోయాడు. అయితే చంద్రబాబు ప్రజలని.. భయభ్రాంతులకు గురిచేయడం వలనే టీడీపీ గెలిచిందని అన్నారు. ఇదే టైంలో కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు వచ్చాయి. కాకినాడలో ఎలా అయిన గెలిచి, నంద్యాల గెలుపు కేవలం టీడీపీ ప్రలోభాల వలన వచ్చిందే అని వైసీపీ నాయకులు చెప్పాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఎ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. 48 వార్డులకి గాను 10 వార్డుల్లో మాత్రమె వైసీపీ గెలిచింది. మొత్తం 32 వార్డుల్లో టీడీపీ జెండా ఎగరేసింది.

దాంతో మరోసారి వైసీపీకి ప్రజలు భారీ షాక్ ఇచ్చినట్లు అయింది. నంద్యాలలో గెలుపు ప్రలోభాలు అనుకున్న, టీడీపీకి గత 30 ఏళ్ళుగా ఎలాంటి బలంలేని కాకినాడలో భారీ ఆధిక్యం రావడం అంటే ప్రజల ఆలోచన ధోరణి ఎలా ఉంది. అసలు ప్రజలు వైసీపీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే విషయాలని జగన్ అలోచించాల్సి అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -