Monday, May 6, 2024
- Advertisement -

మహేష్ బాబుది చెత్త సినిమానా?

- Advertisement -

మహేష్ బాబు కెరీర్ కు హై స్పీడ్ లో తీసుకెళ్లిన సినిమా పోకిరి అయితే.. ఆ స్పీడ్ కు రోడ్డేసిన సినిమా ఒక్కడు. తన కెరీర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఒక్కడు సినిమా అంటే.. ప్రిన్స్ కు ఎప్పుడూ ప్రత్యేకమే.

గుణశేఖర్ డైరెక్షన్ లో.. భూమిక హీరోయిన్ గా.. మణిశర్మ సంగీత దర్శకత్వంలో రిలీజై ఘన విజయం సాధించిన ఒక్కడు సినిమాకు.. ఇప్పటికీ టాలీవుడ్ మంచి సినిమాల్లో ఒకటిగా పేరుంది. అయితే.. ఒక్కడు సినిమా హిందీలో.. అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా జంటగా తేవర్ పేరుతో రీ మేక్ అయ్యింది. హిందీ జనాలకు ఈ సినమా నచ్చకపోవడంతో.. తేవర్ డిజాజ్టర్ గా నిలిచింది.

బాలీవుడ్ లో కొన్నాళ్లుగా ఏటా చెత్త సినిమాలకు అవార్డులు ఇవ్వడం ఓ సంప్రదాయంగా వస్తోంది. అందులో.. డిజాజ్టర్ సినిమాలను నామినేట్ చేస్తుంటారు. అలాంటి వాటిలో.. సల్మాన్ ఖాన్ ప్రేమ్ రతన్ దన్ పాయో తోపాటు.. తేవర్ కూడా నామినేట్ అయ్యింది. ఈ విషయం తెలిసి… మహేష్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ ఫీలవుతున్నారు. ఆ చెత్త అవార్డేదో తేవర్ కు రావొద్దని కోరుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -