Friday, May 10, 2024
- Advertisement -

టీడీపీ చాప్టర్‌ క్లోజ్‌..

- Advertisement -

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాప్టర్‌ క్లోజ్‌ అయినట్లే కనిపిస్తోంది. వరుస ఎన్నికల్లో గెలవడం మాట అటుంచి డిపాజిట్లు కూడా గెలుచుకోలేక పోతోంది. తాజాగా రెండు కార్పొరేషన్‌లు, ఒక నగరపంచాయతీలకు జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ ఖాతా తెరవలేక పోయింది. ఆపార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ చిత్తుగా ఓడిపోయారు. 

పోరాటాల పురిటిగడ్డగా పిలుచుకునే ఖమ్మంలో.. నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు.. టీఆర్ఎస్‌కు అనుకూలంగా వచ్చాయి. నగరపాలక సంస్థపై తొలిసారిగా గులాబీ జెండా రెపరెపలాడింది. సుదీర్ఘకాలం మున్సిపాలిటినీ పాలించిన కామ్రేడ్లు ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేక పోయారు. ఖమ్మం నగర పాలక సంస్థలోని 50 డివిజన్‌లకు గాను.. టీఆర్ఎస్‌ 34 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ పది స్థానాల్లోనూ, సీపీఐ, సీపీఎం, వైసీపీలు రెండేసి స్థానాల్లోనూ గెలిచాయి. తెలుగుదేశం పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకు పోయింది. వైసీపీ కనీసం రెండు స్థానాల్లో గెలిచి ఉనికిని చాటుకుంది. 

ఇక అచ్చంపేట అచ్చంగా టీఆర్ఎస్‌ కైవసమైంది. నగర పంచాయతి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. మొత్తం 20 వార్డుల్లోనూ టీఆర్ఎస్‌ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఐదు రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. అచ్చంపేటలో మహాకూటమి అభ్యర్థులు ఎలాంటి ప్రభావాన్నీ చూపలేక పోయారు. టీఆర్ఎస్‌ అభ్యర్థుల గెలుపుతో.. నగరపంచాయతీ కార్యాలయంపై గులాబీ జెండాను ఎగురవేశారు. టీఆర్ఎస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగి పోయారు. 

 ఒక ఉద్యమాలకు ఊపిరిలూదే ఓరుగల్లు నగరపాలక సంస్థపైనా గులాబీ జెండా రెపరెపలాడింది. ఇక్కడా తెలుగుదేశం పార్టీ ఖాతను ప్రారంభించలేక పోయింది. అయితే టీడీపీ మిత్రపక్షం బీజేపీ రెండు స్థానాలను గెలుచుకోవడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్‌ కొంత ఊపిరి నిలుపుకుంది. ఏడుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించడం ఓరుగల్లు విశేషం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -