- Advertisement -

‘మహా’ ఒప్పందం

- Advertisement -

గోదావరిపై, పెన్‌గంగలపై నిర్మించతలపెట్టిన ఐదు కీలక ప్రాజెక్టులకు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాన్ని చరిత్రాత్మకమైనదిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, ఫడ్నవిస్‌లు వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలోని సహ్యాద్రి అతిథిగృహంలో.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం, సీఎంలు ఒప్పందాలను ఇచ్చిపుచ్చుకున్నారు.

నాలుగు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల వివాదానికి ఈ ఒప్పందం తెరవేసింది. గతంలో ఒప్పందాలు కుదిరిని ప్రాజెక్టులు.. కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటినీ ఈ ఒప్పందం ద్వారా ఒకే ఛత్రం కిందికి వస్తాయి. గత ప్రభుత్వాలు కుదుర్చుకున్న లెండి, పెన్‌గంగ మొదలైన ప్రాజెక్టులన్నింటికీ కట్టుబడి ఉండాలని, కొత్త ప్రాజెక్టుల సాంకేతిక అంశాలను కొత్తగా ఏర్పడ్డ బోర్డు పరిష్కారం చూపుతుందని ఒప్పందంలో పేర్కొన్నారు.

మరోవైపు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసుకుని ఈ సాయంత్రం తిరిగిరానున్న కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -