Monday, May 13, 2024
- Advertisement -

నో సినిమా.. ఓన్లీ సంసారం – అసిన్

- Advertisement -

గజని, ఘర్షణ సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన హీరోయిన్ అసిన్. ఆ మధ్య పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇది జరిగి దాదాపు రెండెళ్లు అవుతోంది. అయితే మీడియా మాత్రం అసిన్ ఇదిగో నటిస్తోంది.. అదిగో నటిస్తోంది అంటూ ఆమె వెంటపడుతున్నారు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన అసిన్ మీడియా మిత్రులకు ఓ ప్రకటన పంపింది. ఇక సినిమాల్లో నటించనని ముందే చెప్పానని, అయితే అర్ధం కాని కొందరు మీడియా మిత్రులు మాత్రం నటిస్తున్నట్లుగా వార్తలు రాస్తున్నారని, మరోసారి ఆ మిత్రులకు తాను ఇక నటించనని చెబుతున్నానని ఘాటుగా చెప్పింది.

సినిమాలకు గుడ్ బై చెప్పిన తాను ఇక సంసారానికి పరిమితం అవుతానని కూడా తెగేసి చెప్పింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -