Thursday, May 9, 2024
- Advertisement -

అవికా గోర్ కి అవకాశాలు లేక.. ఆ పని చేస్తోంది..?

- Advertisement -

అవికా గోర్.. చూడగానే మన ఇంట్లో ఉండే అమ్మాయిలానే కనిపిస్తోంది. ఆమె చేసిన పాత్రలు కూడా అలానే ఉంటాయి. ఉయ్యాల జంపాల తో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి తో ఓ మోస్తరు హిట్ అందుకుంది. ఇక మూడో సినిమాగా సినిమా చూపిస్త మావ తో మళ్లీ సూపర్ అందుకుంది. చివరగా ఎక్కడికి పోతావు చిన్నవాడా తో బ్లాక్ బస్టర్ కొట్టింది.

ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న కూడా.. ఈ భామకు అవకాశాలు రావడం లేదు. మంచి పెర్ఫామర్ అయినప్పటికీ.. ఆమె సినిమాలు బాగా ఆడినప్పటికీ ఫిజిక్ విషయంలో కేర్ తీసుకోకపోవడంతో ఆమె మీద టాలీవుడ్ జనాల్లో నెగెటివ్ ఫీలింగ్ పడిపోయింది. ఆమెకు కొందరు కావాలనే అవకాశాలు రాకుండా చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే కారణమేదైనప్పటికి ఏడాదిగా అవికాకు ఇక్కడ అవకాశాలు లేవు. మాతృ భాష హిందీలో సైతం ఆమెకు సినిమాలేవీ దక్కలేదు. దీంతో తనకు ముందు గుర్తింపు తెచ్చిపెట్టిన బుల్లితెరనే నమ్ముకుంటోందట అవికా. బాలికా వధు సీరియల్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న అవికా.. ఇప్పుడు లాడా-2 సీరియల్లో నటించేందుకు సిద్దమైంది.

హిందీలో ఒక సీరియల్ కమిటైతే కొన్నేళ్ల పాటు సాఫీగా బండి లాగించేయొచ్చు. ఇలా రెండు మూడు సీరియళ్లలో నటిస్తే లైఫ్ సెట్ అయిపోతుంది. మూవీ ఛాన్సుల కోసం ఎదురు చూసి నిరాశ చెందడం కనా.. తనకు అచ్చొచ్చిన బుల్లితెరనే నమ్ముకుని జీవితంలో స్థిరపడదామని అవికా ఫిక్సయినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇకపై ఆమె సినిమాల్లో నటించే అవకాశం చాలా తక్కువే అని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -