Monday, May 13, 2024
- Advertisement -

వర్మకు దర్శకేంద్రుడు అడ్డం పడతాడా..?

- Advertisement -

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్ టి రామారావుగారి జీవితాన్ని తెరకెక్కించే పనిలో‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సినిమా తీస్తోన్న సంగతి మనకు తెలిసిందే. ఈ బయోపిక్ ను లక్ష్మీ పార్వతి కోణంలోంచి తీస్తానని మొదట్లోనే బాంబు పేల్చిన రాము… కీ రోల్స్ కోసం ఆర్టిస్టులను ఎంచుకునే పనిలో ఫుల్ బిజీ అయిపోయాడు.

మరీ ముఖ్యంగా ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు నాయుడు పాత్రల్లో కనుపించబోయే నటీనటులపైనే అందరికీ ఆసక్తి ఎక్కువగా నెలకొనిఉంది. మూవీ వర్గాల నుంచి వినిపిస్తున్న తాజా ఇన్ఫో ప్రకారం…. చంద్రబాబు పాత్ర కోసం వర్మ జెడి. చక్రవర్తిని సెలెక్ట్ చేశాడని చెబుతున్నారు.

దీనికి కారణం… లుక్స్ దగ్గర్నుంచి, బాడీ లాంగ్వేజ్ వరకు జేడీ అయితేనే బాబు పాత్రకు సరిగ్గా సరిపోతాడని వర్మ ఆలోచన కావచ్చు. ఐతే ఈ పాత్రను జేడి చేయడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది డౌటే. ఎందుకంటే… జేడి చక్రవర్తి బాబు ఆంతరింగిక మిత్రులైన కె.రాఘవేంద్రరావు కు ఎంతో సన్నిహితుడు. ఒకవేల వర్మ ఆఫర్ చేసినా.. రాఘవేంద్రరావు వద్దు అంటే జేడి బాబు పాత్రనుంచి డ్రాప్ అయిపోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -