Friday, May 10, 2024
- Advertisement -

పక్క హీరో పాట అబ్బనీ తీయని(ముసలి) దెబ్బ…

- Advertisement -

తెలుగు సినిమా హీరోలకి మంచితనం, తిక్క, చాదస్తం, పొగరు, ఇలా అన్ని కలిసి ఉంటాయి కాబోలు.. ఇదంతా ఎందుకంటున్నా అంటే ఇటీవల ఒక పెద్ద  TOP10 హీరోలో ఒకడైన హీరో.. ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా జరుగుతుంది.. రాష్ట్ర నలుమూలల నుండి అభిమానులు వచ్చారు.

ఇక మన హీరో వచ్చాడు అని అనగానే కూర్చున్న అభిమానులు లేచి విజిల్స్ చప్పట్లు హాలు అంత సందడిగా మారింది.. ఇక chair లేక నిలబడి ఉన్న ఒక అభిమాని ఏదో అన్నాడు.. అది మన హీరో చెవిలో పడింది. ఆ మాటలు హీరో మనసులో ఏమనిపించాయో ముసిముసిగా నవ్వుకుంటూ స్టేజ్‌మీదకు వెళ్ళాడు.. మాట్లాడాడు.. కానీ మనసులో ఇంతవరకు ఆ అభిమాని అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి.. అతన్నే గమనిస్తున్నాడు.. ఎక్కడున్నాడా అని… ok function అయిపోయింది..

ఇక అందరూ బయటికొస్తున్నారు.. ఆ అభిమాని bad luck.. మన హీరో good luck రెండు ఒకసారి కలిసాయి.. మన హీరో స్టేజి మీద నుండి కిందకి వస్తున్నాడు.. ఆ అభిమాని మళ్ళీ కనిపించాడు.. మన హీరో సెక్యూరిటీని పిలిచి ఆ రెడ్ టీ షర్ట్ వేసుకున్న వాన్ని రమ్మను అని పక్కనే ఉన్న రూం కి వెళ్ళాడు.. అక్కడున్న వాళ్ళంతా shock.. వాన్ని ఎందుకు రమ్మన్నాడు.. అని.. ok.. ఏదో అనుకొని వాడు వెళ్ళాడు.. అభిమాని లోనికి వెళ్ళగానే మన హీరోలో కోపం కస్సుమంది.. అభిమాని చెంప చెల్లుమనిపించాడు.. నా కొడకా ఇందాక ఏమన్నావురా.. నేను ముసలాడినా… నాకు age అయిపోయిందా.. మేకప్ వేస్తేనే నేను హీరోనా.. తోలు తీస్తా… అంటూ తిట్ల పురాణం.. కొట్టుడు పర్వం ముగించాడు..

అయినా ఆ అభిమాని బాధపడలేదు.. కారణం అభిమాని కాబట్టి. రేయ్ నేను నిన్ను కొట్టిన విషయం తిట్టిన విషయం బయట చెప్పావో… అని బెదిరించి బయటికి వెళ్ళమన్నాడు.. సార్ నేను మీకు ఊహ తెలిసినప్పటినుంచి అభిమానిని సార్.. ఎవరికి దక్కని అదృష్టం ఈ రోజు నాకు దక్కింది.. మీరు హ్యాపీగా ఉండాలి సార్.. అంటూ బయటికి వస్తూ.. అబ్బని తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా… అంటూ పక్క హీరో పాటైనా.. సందర్బానికి పనికొచ్చింది.. అని పాడుకుంటూ వెళ్ళాడు.. ఇదంతా బయటికి ఎలా తెలిసిందబ్బా వీడు చెప్పకుండా అంటారా.. వీళ్ళూ మాట్లాడుకున్న రూంలో సి.సి. కెమెరా ఉంది అందులో ప్రతిది రికార్డ్ అయ్యింది.. అదీ మ్యాటర్.. ఎవరా హీరో… just think…

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -