Thursday, May 8, 2025
- Advertisement -

ఆ యంగ్ హీరోల ముందు నిలబడ్డలేకపోయిన పవన్..?

- Advertisement -
Big Insult To Pawan Kalyan Infront Of Raj Tarun Nani

స్టార్ హీరోల చిత్రాలు వస్తున్నాయంటే.. థియేటర్లలో వున్న చిన్న హీరోల సినిమాల ను లెక్కచేయకుండా తీసేసి.. వాటి స్థానంలో స్టార్ హీరోల సినిమాలను ప్రదర్శిస్తారు. హిట్ అయిన లేక ప్లాప్ అయిన కొన్నిరోజులపాటు ఆడిపిస్తారు. ఎందుకంటే.. భారీ డబ్బులు ముట్టజెప్పిమరీ రైట్స్ తీసుకుంటారు కదా! అవి రికవర్ అయ్యేంతవరకు ఆడిస్తారు.

సినిమా హిట్ అయితే థియేటర్ యాజమాన్యాలకు పండగే.. అదే సినిమా ప్లాప్ అయితే వారికి చుక్కలే. ఆడియెన్స్ సరిగ్గా రాక, వసూళ్లు లేక, తీసేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్‌లో తికమక చెందుతారు. ఒకవేళ కలెక్షన్స్ మరీ దారుణంగా వస్తున్నాయంటే మాత్రం.. డౌట్ లేకుండా తొలగించేస్తారు. ఇప్పుడిదే పరిస్థితి ‘కాటమరాయుడు’కి ఎదురవ్వడం దారుణం. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజైన క్రమంలో.. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 శాతానికిపైగా థియేటర్లలో వేశారు.

పాజిటివ్ టాక్‌తో, మంచి వసూళ్లతో దూసుకెళుతున్న ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘నేను లోకల్’ సినిమాల్ని సైతం తీసేసి.. రాయుడిని థియేటర్లలోకి దించారు. అయితే.. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకి అన్నిచోట్ల నుంచి నెగెటివ్ ప్రచారం ఎక్కువైపోవడంతో రెండోరోజే కొన్ని థియేటర్ల నుంచి తొలగించేశారు. ఇక వీక్ డేస్‌లలో కలెక్షన్లు మరింత దారుణంగా వస్తుండడంతో.. మరిన్ని థియేటర్లలో నుంచి కాటమరాయుడుని ఎత్తేశారు.  ఆ సినిమా స్థానంలో మళ్ళీ రాజ్ తరుణ్, నానిల సినిమాలు ప్రదర్శించారు. పవన్‌లాంటి స్టార్ హీరో సినిమాకి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం అవమానకరమే. 

Related

  1. పవన్ రికార్డుని పటాపంచలు చేసిన అల్లు అర్జున్
  2. కాటమరాయుడు ఫెయిల్యూర్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు
  3. పవన్ రోజుకు ఎంత తీసుకుంటున్నారో తెలుస్తే షాక్ అవుతారు!
  4. షాకింగ్ న్యూస్ : పవన్ త్రివిక్రమ్ ల మూవీ స్టోరీ లీక్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -