Sunday, May 12, 2024
- Advertisement -

కాటమరాయుడు ఫెయిల్యూర్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
Pawan Kalyan Comments on Katamarayudu Failure

పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.దీనికి తగ్గట్టుగా పవన్ కూడా ఈ మూవీ గురించి ఇంటర్వ్యూ కూడ ఇవ్వకపోవడంతో ఈమూవీ కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల సినిమాగానే మారింది.

ఇది ఇలా ఉండగా.. అగ్రిగోల్ద్ బాధితులను ఓదార్చడానికి విజయవాడ వెళ్లిన పవన్.. అగ్రిగోల్ద్ బాధితులను కలిసిన తర్వాత మీడియా ప్రతినిధులతో అగ్రిగోల్ద్ సమస్య పై స్పందించాడు. అయితే ఈమాటల మధ్య ఒక మీడియా సంస్థ ప్రతినిధి పవన్ ఇరుకున పెట్టడానికి ‘కాటమరాయుడు’ సినిమా రిజల్ట్ పై పవన్ అభిప్రాయం అడిగినప్పుడు పవన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తను మూవీస్ గురించి మాట్లాడానికి ఇక్కడికి రాలేదని.. సినిమా బాగుంటే  చూస్తారని లేకుంటే చూడరని.. నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోనని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

తనకు సినిమాలకన్న ప్రజా సమస్యలు చాల ముఖ్యం అని కామెంట్స్ చేసాడట. పవన్ నటిస్తున్న సినిమాలు నచ్చితేనే జనం చూస్తారు అని పవన్ కామెంట్స్ చేసినట్లు వార్తలు రావడంతో కేవలం పవన్ ఇమేజ్ ని నమ్ముకుని ఒక జూదంలా పవన్ నటించిన సినిమాలు కొనుక్కుని నష్టపోయేకన్నా భవిష్యత్ లో పవన్ నటించే సినిమాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదేమో అని అంటూ ఈమధ్య కాలంలో పవన్ సినిమాలు కొనుక్కుని నష్టపోయిన బయ్యర్లు తమ సన్నిహితుల వద్ద కామెంట్స్ చేస్తున్నట్లు టాక్.

{youtube}tjhHRUdSc7g{/youtube}

Related

  1. షాకింగ్ న్యూస్ : పవన్ త్రివిక్రమ్ ల మూవీ స్టోరీ లీక్..?
  2. పవన్ ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలుసా..?
  3. పవన్ పై సంచలన కామెంట్ చేసిన రామ్ చరణ్
  4. పవన్ ఫ్యాన్స్.. లైవ్ లో పెద్ద గొడవ చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -