Saturday, April 27, 2024
- Advertisement -

షాకింగ్ : బిగ్‌బాస్ నుంచి గంగవ్వ బయటకు.. ఎందుకంటే ?

- Advertisement -

బిగ్ బాస్ నాలుగో సీజన్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం గంగవ్వ నామినేషన్ లో కూడా లేదు. గంగవ్వ ఈ సీజన్‌లో స్పెషల్ కంటెస్టెంట్. గంగవ్వను జాగ్రత్తగా చూసుకోమని కంటెస్టెంట్లందరికీ నాగార్జున చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే గంగవ్వను అందరూ బానే చూసుకుంటున్నారు. ఆ మధ్య ఓ సారి గంగవ్వ ఆరోగ్యం క్షిణించింది.

ఏసీ గదులు, ఆ తిండి గంగవ్వకు పడలేదు. అందుకే ఆరోగ్యం క్షిణించింది. ఆ టైంలో గంగవ్వకు మంచి వైద్యం అందించారు. బిగ్ బాస్ ధైర్యం కూడా చెప్పారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో కూడా మళ్లీ గంగవ్వ అనారోగ్యానికి లోనైంది. తిండి సరిగ్గా పోవడం లేదని, తాను తన ఇంటికి వెళ్లిపోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇంట్లో వాళ్లతో మాట్లాడితే ఓకేనా అని ఇంటి సభ్యులు అడిగితే.. లేదు ఇంటికే పోవాలని ఉందని గంగవ్వ చెప్పింది. అయితే గంగవ్వకు ఆరోగ్యం బాలేకపోవడంతోనే బయటకు పంపించినట్లు తెలుస్తోంది.

కానీ ఇది ఎలిమినేషన్ కిందకు రాదు. ఒకేవళ ఆరోగ్యం బాగుంటే మళ్లీ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉండేలా అనమతి ఇస్తారని తెలుస్తోంది. ఐదో వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లలో డేంజర్ జోన్‌లో ఉన్నది మాత్రం అమ్మ రాజశేఖర్, సుజాత. ఇందులో మరీ ముఖ్యంగా సుజాత తన వెకిలి నవ్వు, బిట్టూ అని నాగార్జునను పిలవడం జీర్ణించుకోలేని జనాలను ఆమెను ఎలిమినేషన్ చేశారని తెలుస్తోంది. అసలు ఏం జరగబోతుందో ఆదివారం ఎపిసోడ్ తో తెలిపోతుంది.

రాజమౌళి బర్త్ డేకి చరణ్, ఎన్టీఆర్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ?

మహేష్ తో త్రివిక్రమ్ ఆల్మోస్ట్ ఓకే చేసినట్టే..?

ప్రభాస్ కు బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

ఒక్క రోజు షూటింగ్ చేస్తే రమ్యకృష్ణకు ఎంత ఇస్తారో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -