Friday, May 3, 2024
- Advertisement -

ఒక్క రోజు షూటింగ్ చేస్తే రమ్యకృష్ణకు ఎంత ఇస్తారో తెలుసా ?

- Advertisement -

ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు పెళ్లిళ్ళు అవ్వుతే ఇక వారి కెరీర్ ముగిసిందని అంటూ ఉంటారు. తర్వాత వారు సినిమాల్లో నటించిన హీరోయిన్ గా ఉన్నప్పుడు అందుకున్న రెమ్యునరేషన్ అందుతుందని కచ్చితంగా చెప్పలేం. అయితే ఈ విషయంలో మాత్రం శివగామి రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్లకే షాక్ ఇస్తూ పారితోషకం అందుకుంటుంది. ‘బాహుబలి'(సిరీస్) తరువాత రమ్యకృష్ణకు విపరీతమైన క్రేజ్ పేరిగింది.

తరువాత ఈమె నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘సూపర్ డీలక్స్’ ‘గ్యాంగ్'(తమిళ్) వంటి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఈమె చేసేది తల్లి, అత్త పాత్రలు అయినప్పటికి రమ్యకృష్ణ ఉంటే సినిమాకు హైప్ వస్తుందని ఆమెనే కావాలి అంటున్నారు దర్శకనిర్మాతలు. దీంతో ఈమె ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. రమ్యకృష్ణ షూటింగ్లో పాల్గొనే ఒక్కో రోజుకు రూ.10 లక్షల చొప్పున తీసుకుంటుందట. ఈమె 10రోజులు కనుక షూటింగ్లో పాల్గొంటే 1కోటి రూపాయలు వరకూ అందుకుంటుందన్న మాట. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ అలాగే సాయి తేజ్ ల కొత్త చిత్రాల్లో నటిస్తుంది.

ఈ సినిమాలకు కూడా ఇదే స్థాయిలో తీసుకుంటుందట. స్టార్ హీరోయిన్లైన పూజ హెగ్డే, రష్మిక , కీర్తి సురేష్ వంటి వారు రూ.1.5 కోట్ల నుండీ రూ.2కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నారు. ఇక కుర్ర హీరోయిన్లైన రాశీ ఖన్నా, నిధి అగర్వాల్, నభా నటేష్ వంటి వారు 0.60 కోట్ల వరకూ అందుకుంటున్నారు. ఆ రకంగా చూస్తే రమ్య కృష్ణ .. కుర్ర హీరోయిన్లను మించే రెమ్యునరేషన్ అందుకుంటుంది.

బిగ్ బాస్‌లో నాగార్జున ప్లేస్ లో రమ్యకృష్ణ.. ఎందుకు ?

పూరీ తో ఆ రీమేక్ సినిమా పవన్ కళ్యాణ్ చేసేనా..?

నాగార్జున మాటలు నన్ను బాధ కలిగించింది : స్వాతి దీక్షిత్

పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -