Thursday, April 25, 2024
- Advertisement -

మహేష్ తో త్రివిక్రమ్ ఆల్మోస్ట్ ఓకే చేసినట్టే..?

- Advertisement -

కొద్దీ సినిమాలతోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగిన త్రివిక్రమ్ కి రచయితగా మంచి పేరుంది..  పవన్ తో భారీ ఫ్లాప్ సినిమా తర్వాత త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ తో చేసిన అరవింద సమేత మంచి హిట్ ని ఇచ్చింది.  ఆ తర్వాత అలవైకుంఠపురం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. అల్లు అర్జున్ కెరీర్ లో ఈ సినిమా టాప్ మోస్ట్ హిట్ గా నిలిచింది.. దాంతో త్రివిక్రమ్ తిరిగి తన పూర్వ వైభంగా కొనితెచ్చుకున్నాడు.. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా ని చేస్తున్న త్రివిక్రమ్ తదుపరి చిత్రం పై ఇప్పటినుంచే బజ్ క్రియేట్ అవుతుంది.. మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్ ఇద్దరిలో ఒకరితో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి..

రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం RRR సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తర్వాత ఏ సినిమాకి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. దాంతో చరణ్ తదుపరి సినిమా ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడో అని అందరు తెగ చర్చించుకుంటున్నారు.. అయితే చరణ్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ ఏ డైరెక్టర్ తో సినిమా ని ఒప్పుకోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.. నిజానికి రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమా ఇదివరకే చేయాలి కానీ ఎందుకు ఆ సినిమా పట్టాలెక్కలేదు.. ఇన్నాళ్లకు ఈ సినిమా కుదరబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యలో మహేష్ బాబు ఈ సినిమా కు అడ్డుపడుతున్నాడని మరో వార్త ఇప్పుడు హల్చల్ అవుతుంది.

అది నిజం చేస్తూ ఇప్పుడు త్రివిక్రమ్ తో మహేష్ సినిమా ఓకే అయ్యిందన్న వార్త ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. వచ్చే వేసవిలోగా షూటింగ్ పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఈ రెండు అయ్యాక కానీ ఏది చెప్పడానికి లేదు. రాజమౌళి సినిమాకు ఇంకా చాలా టైం పట్టేలా ఉంది కాబట్టి మహేష్ ఆలోగా ఇంకో మూవీ చేసుకోవచ్చు. త్రివిక్రమ్ ఎక్కువ టైం తీసుకునే రకం కాదు. సబ్జెక్టుని బట్టి ఈ మధ్య కాలంలో ఫాస్ట్ గానే తీస్తున్నారు.  మరీ అన్ని ఓకే అయితే త్రివిక్రమ్ మహేష్ కాంబో లో సినిమా త్వరలోనే చూడొచ్చన్నమాట..

పూరీ తో ఆ రీమేక్ సినిమా పవన్ కళ్యాణ్ చేసేనా..?

అనుష్క తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే నా..?

త్రివిక్రమ్ వల్ల మహేష్ , చరణ్ ల మధ్య గ్యాప్ పెరగనుందా..?

ఈ విజయ్ సినిమా వెనుక అల్లు అర్జున్ హస్తం ఉందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -