Friday, April 19, 2024
- Advertisement -

ఆది పురుష్ చిత్రంలోని కీలక పాత్ర పై స్పందించిన బిగ్ బాస్ విన్నర్?

- Advertisement -

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆది పురుష్ చిత్రం పై అందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. రామాయణం కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా సీతగా కృతిసనన్ సందడి చేయనున్నారు. అదేవిధంగా రామాయణంలో ఎంతో కీలక పాత్ర అయిన రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.

ఆది పురుష్ చిత్రంలోని ఎంతో కీలకమైన మేఘనాథ్ పాత్ర గురించి గత కొద్ది రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ పాత్రలో నటించడం కోసం హిందీ బిగ్ బాస్ సీజన్‌ 13 విన్నర్‌ సిద్దార్థ్‌ శుక్లాను చిత్ర బృందం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also read:అరియనా వాట్సాప్ డీపీ, వాల్ పేపర్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే!

తాజాగా మేఘనాథ్ పాత్రపై బిగ్ బాస్ సీజన్‌ 13 విన్నర్‌ సిద్దార్థ్‌ శుక్లాను ఇదే విషయంపై స్పందించిగా అందుకు సిద్ధార్థ్ ఇప్పటి వరకు తనని ఎవరు కలవలేదని.. ఆది పురుష్ చిత్రంలోని ఈ పాత్రకు సంబంధించి ఇంతవరకు తనని ఎవరు కలవలేదని చెప్పడంతో ఇప్పటివరకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఈ విధంగా చెక్ పెట్టినట్లు అయింది.హిందీలో బాలికా వధు, దిల్‌ సే దిల్‌ తక్‌ వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందిన సిద్దార్థ్‌.. బిగ్‌బాస్‌ సీజన్‌13తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇకపోతే సిద్దార్థ్‌ శుక్లా నటించిన ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్’ అనే ఓ వెబ్‌సిరీస్‌ విడుదలకు రెడీగా ఉంది.

Also read:అక్కడ అసభ్యకరంగా తాకాడు.. చచ్చేలా కొట్టా: నవ్య స్వామి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -