Tuesday, April 23, 2024
- Advertisement -

నటుడు సోనుసూద్ కి నోటీసులు జారీ చేసిన ముంబై హైకోర్టు?

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా క్లిష్ట పరిస్థితులలో ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఎంతోమంది మన్ననలు పొందుతున్న సినీనటుడు ముంబై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల కాలంలో సోనుసూద్ తో సహా ఇతర సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఆపదలో ఉన్నవారికి యాంటీ కోవిడ్ డ్రగ్ పంపిణీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే
ఈ సేవా కార్యక్రమాలపై జస్టిస్ అమ్జాద్ సయీద్, గిరీష్ కులకర్ణిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

కోవిడ్ యాంటీ డ్రగ్స్ పై కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది. అటువంటి సమయంలో సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు ఈ యాంటీ డ్రగ్స్ ఎక్కడినుంచి లభిస్తున్నాయంటూ ముంబై హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి కష్ట కాలంలో ప్రజల సంక్షేమం కోసం ఈ విధంగా మంచి ఆలోచన చేయడం చాలా మంచి దేనని, అయితే ఇంత పెద్ద మొత్తంలో వీరికి ఇంజెక్షన్లు ఎక్కడినుంచి లభ్యమవుతున్నాయనీ ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Also read:అక్కడ అసభ్యకరంగా తాకాడు.. చచ్చేలా కొట్టా: నవ్య స్వామి

ఈ యాంటీ డ్రగ్స్ ఈ విషయంలో వీరు అధికారికంగానే మందులను సమకూరుస్తున్నారా లేదా డ్రగ్స్ విషయంలో ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ కుంభకోణం ఉందనే విషయంపై సమగ్ర విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. రెమిడిసివర్‌ సహా మరికొన్ని కంపెనీలు కేవలం కేంద్రానికే మందులు చేస్తున్నాయని, సెలబ్రిటీలకు మందులు సరఫరా చేయడం లేదని తెలుపగా మరి సెలబ్రిటీలకు మందులు ఎక్కడినుంచి వస్తున్నాయని కోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు నటుడు సోనూసూద్‌ సహా, ముంబై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ, ఇతర సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also read:అరియనా వాట్సాప్ డీపీ, వాల్ పేపర్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -