Friday, May 17, 2024
- Advertisement -

తీన్మార్ కు బిత్తిరి సత్తి గుడ్ బై.. ఎందుకు..?

- Advertisement -

బిత్తిరి సత్తికి ఇప్పుడు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తీన్మార్ వార్తల ద్వారా తన కామెడీ టైమింగ్ తో జనాలను విపరితంగా నవ్విస్తున్నాడు. బిత్తిరి సత్తి తీన్మార్ వార్తల ద్వారా చాలా మంది ఫ్యాన్స్ ను సంపాధించుకున్నాడు. అంతేకాకుండా బిత్తిరి సత్తియూట్యూబ్ లో కూడా బాగా పాపులర్ అయిపోయాడు.

లక్షల్లో వ్యూస్ చూస్తేనే అతడి ఫాలోయింగ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. వార్తలు అంటే ఒక పద్దతిలో సీరియస్ గా ఉంటాయి.. అలానే ఉండాలనే ట్రెండ్ ను పూర్తిగా మార్చేసిన షో తీన్మార్. ఈ షో టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది. సెటయిరికల్ గా న్యూస్ ను ప్రజంట్ చేస్తూ.. జన సామాన్యానికి సైతం సులువుగా ఎక్కేలా ఎన్నో పెద్ద పెద్ద వార్తలను ఇవ్వడంలో తీన్మార్ సక్సెస్ అయ్యింది. కరెంట్ అఫైర్స్ లో ఓ లీడ్ వార్త ను తీసుకుని మాంచి మాస్ మసాలా పంచ్ లతో ఏమాత్రం అసభ్యతకు తావీయకుండా.. పక్కా స్ర్కిప్టులతో, ఓ కామెడీ స్కిట్ చేసినట్లుగా వార్తలను ఇవ్వడంలో బిత్తిరి సత్తి, యాంకర్ సావిత్రి మంచి సక్సెస్ సాధించారు. ఇది ఇలా ఉంటే.. సత్తి తీన్మార్ వార్తలకు గుడ్ బై చెప్పెస్తున్నాడనే గాసిప్స్ బలంగా వినిపిస్తున్నాయి. సత్తి సినిమాల్లో బిజీ కావడం వల్ల.. తీన్మార్ కు టైం ఇవ్వలేకపోతున్నాడట.

సత్తి ఓ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడట అందుకే తీన్మార్ వార్తలకు టైం కేటాయించలేకపోతున్నాడట. సినిమా ఆఫర్లు జోరుగా వస్తున్న క్రమంలో సత్తి తీన్మార్ వార్తలకు గుడ్ బై చెప్పే దిశలో ఉన్నట్లు కనిపిస్తోంది. అన్నట్లు బిత్తిరి సత్తిగా పాపులర్ అయిన ఈ జర్నలిస్టు పేరు రవి. మంచి గాయకుడు కూడా.. అలవోకగా తెలంగాణ భాషలో పాటలు పాడగలడు. ఈ క్రమంలో తెలంగాణ వేషదారణ, భాషల్లో అదరగొట్టే సత్తి లాంటి వారికి సినీ రంగంలో మంచి భవిష్యత్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పేదేముంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -