Thursday, May 9, 2024
- Advertisement -

చంద్రబాబు సర్కార్‌ కుట్రకు బ్రేక్‌

- Advertisement -

చౌకగా సదావర్తి సత్రం భూములను తన అనుయాయులకు కట్టబెట్టాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్‌ కుట్రకు బ్రేక్‌ పడింది. సుమారు గంటపాటు పోటాపోటీగా సాగిన బహిరంగ వేలంలో సదావర్తి సత్రం భూములు మూడింతల ఎక్కువ ధర పలికింది. వేలంలో వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన కడప వాసి సత్యనారాయణరెడ్డి రూ.60.30 కోట్లతో సదావర్తి భూములను దక్కించుకున్నారు.

సదావర్తి సత్రం భూముల అమ్మకానికి సోమవారం ఉదయం బహిరంగ వేలం ప్రారంభమైంది. చెన్నై టీ నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రంలో సోమవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ప్రక్రియ మొదలైంది. ఎవ‌రూ ఊహించినంత‌గా వేలంపాటు రికార్డు స్థాయికి చేరింది. సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22 కోట్ల రూపాయలకు విక్రయించింది. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈభూముల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం త‌క్కువ‌కే త‌న అనుయాయుల‌కు క‌ట్ట‌బెడుతోందంటూ వైసీపీ ఎమ్మేల్యే ఆళ్ల రామ‌కృష్నారెడ్డి కోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం 22 కోట్ల రూపాయలకు అదనంగా 5 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఆ భూములను మీరే సొంతం చేసుకోవచ్చంటూ సరికొత్త ఆఫర్ ఇచ్చింది.

మెత్తాన్ని చెల్లించేందుకు ఆయన ముందుకు రావడంతో ధరావత్తు చెల్లించాలని సూచించింది. అనంతరం బహిరంగ టెండర్ వేలం వేయాలని సూచించింది. దీంతో 6 సీల్డ్ టెండర్ కవర్లతో పాటు, 2 ఈ ప్రొక్యూర్ మెంట్ టెండర్లు ఈ భూముల కొనుగోలుకు దాఖలయ్యాయి. అనంతరం సదావర్తి భూముల బహిరంగ వేలం ప్రక్రియను ప్రారంభించారు. ఈ వేలంలో 60 కోట్ల 30 లక్షల రూపాయలకు అమ్ముడైంది. టోకెన్ నెంబర్ 10 ఈ మొత్తానికి భూములు కొనుగోలు చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదావర్తి సత్రం భూములను విక్రయించిన ధరకు రెట్టింపు ధర రావడం విశేషం. ఇది చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -