Wednesday, May 15, 2024
- Advertisement -

అక్టోబర్‌లో కో-బ్రాండెడ్‌ ఫీచర్‌ ఫోన్లను మార్కెట్‌లోకి…

- Advertisement -

రిల‌య‌న్స్ జియో 4జీ మార్కెట్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత టెలికంరంగం స్వ‌రూమే మారిపోయింది. అన్ని కంపెనీలు జియోకు పోటీగా ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించాయి. ఇప్పుడు ఇంట‌ర్నెట్ ప్ర‌తీ ఒక్క‌రికి అందుబాటులోకి వ‌చ్చింది. ఇంత‌టితో ఆగ‌కుండా రిల‌య‌న్స్ జియో ఫీచ‌ర్‌ను ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తూ మ‌రో సంచ‌ల‌నానికి తెర‌తీసింది. ఇప్ప‌టికె ఫోన్ల బుకింగ్‌ను కూడా ప్రారంభించింది.

రిల‌య‌న్స్ జియో బాట‌లోనె టెలికం దిగ్గ‌జాలు ఒక్కోటి ఫోన్ల మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నాయి. ఇటీవలే జియోఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్‌ రూ.2500కు స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ప్ర‌క‌టించింది. తాజాగా ప్ర‌భుత్వ టెలికంరంగ సంస్థ బీఎస్ఎన్‌ల్ కూడా త‌న స్మార్ట్ ఫోన్‌ను అందుకుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం దేశీయ మొబైల్‌ డివైజ్‌ తయారీదారులు లావా, మైక్రోమ్యాక్స్‌లతో కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒప్పందం కుదుర్చుకుందని తెలిసింది. 2000 రూపాయల ధరలో, అన్ని ఉచిత ఆఫర్లతో అక్టోబర్‌లో కో-బ్రాండెడ్‌ ఫీచర్‌ ఫోన్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆవిష్కరించబోతుందని వెల్లడైంది.

లావా, మైక్రోమ్యాక్స్‌ వంటి డివైజ్‌ తయారీదారులతో కలిసి సొంత మోడల్‌లో కో-బ్రాండెడ్‌ ఫీచర్‌ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌ అనుపమ శ్రీవాస్తవ చెప్పారు. ఈ ఫోన్లు మార్కెట్‌లో ఉన్న ప్రస్తుత వాయిస్‌ ప్యాకేజీల కంటే ఎక్కువ మొత్తంలో అందిస్తాయన్నారు. ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యాన్ని కూడా అందించబోతున్నట్టు తెలిపారు. . దీంతో దీపావళి పండుగ కంటే ముందస్తుగానే ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌ పూర్తిగా కుదుపులకు లోనుకానున్నట్టు తెలుస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫీచర్‌ ఫోన్‌ లాంచింగ్‌పై లావా కానీ, మైక్రోమ్యాక్స్‌ కానీ స్పందించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -