Monday, May 13, 2024
- Advertisement -

ఆ బాలీవుడ్ హీరో కళ్ళు ” కంచె ” మీద పడ్డాయి.

- Advertisement -

సౌత్ ఇండియన్ సినిమాలు రేమీక్ చేసి హిందీ లో హిట్ లు కొట్టడం బాలీవుడ్ హీరోలకి కొత్తేమీ కాదు. సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ లాంటి వారికి ఇది సాధారణ వ్యవహారం.

 

కంచె సినిమా ఇప్పుడు తెలుగులో సూపర్ హిట్ కొట్టి తమిళ్ లో సైతం రీమేక్ అయ్యే ఆలోచన లో ఉంది. సో ఈ సినిమా మీద పడింది ఇప్పుడు బాలీవుడ్ వారి కన్ను. ఆ మధ్య తుపాకీ రీమేక్ తో హాలిడే హిట్ కొట్టి, ఠాగూర్ ని గబ్బర్ గా తీసి మరీ మంచి కలక్షన్ లు రాబట్టుకున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు కంచె సినిమా హిందీ లో తీసే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ స్టూడియో తో ఈ సినిమా నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు రీమేక్ హక్కులతో పాటు సినిమా డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా ని అక్షయ్ ని పెట్టి తీస్తే బావుటుంది అనేది అక్కడి నిర్మాతల ఆలోచన. అక్షయ్ ని ఠాగూర్ లో పవర్ ఫుల్ గా చూపించాడు క్రిష్ ఆ రాపో తో ఇద్దరూ కలిసి ఒక రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో సినిమా తీస్తే సూపర్ గా ఉంటుంది అంటున్నారు. ఎవరు నిర్మించినా ఎవరు డైరెక్ట్ చేసినా.. తనే హీరోగా నటిద్దామని అనుకుంటున్నాడట అక్షయ్. ఒక్కసారి హరిబాబు పాత్రలో అక్షయ్ ని ఊహించుకుని చూడండి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -