Saturday, May 18, 2024
- Advertisement -

“ఫ్యాన్” గాలి ఎటు?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తోందీ ఎవరికీ అంతు పట్టకుండా ఉంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడాదిన్నర కావొస్తున్నా.. బాబు సర్కార్ పై సమర్థంగా ఎదురుదాడి చేసిన సందర్భాలు చాలా తక్కువే అని వైసీపీ నాయకులు కూడా ఇంటర్నల్ గా ఒప్పుకుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో కేడర్ లో నమ్మకం పెంచి.. ఫ్యూచర్ కోసం పని చేసేలా పార్టీ నాయకత్వం పని చేస్తేనే రిజల్ట్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకోవడం… రీసెంట్ గా కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు అటెండ్ కాకపోవడం మినహా.. అధినేత జగన్ పెద్దగా ప్రభావం చూపే నిర్ణయాలు ఏవీ తీసుకోలేని విషయాన్ని అంతా అంగీకరిస్తారు.

ఇలాంటి జంపింగ్ వ్యవహారాలు, రెగ్యులర్ గా చేసే చిన్న చిన్న దీక్షలు పార్టీని కాపాడేందుకు ఏ మాత్రం ఉపయోగపడవని విశ్లేషకులు చెబుతున్నారు. చూస్తుండగానే ఏడాదిన్నర గడిచిపోయింది. ఇంకో మూడేళ్లు గడిస్తే.. అసెంబ్లీ ఎన్నికల హడావిడి కూడా మొదలవుతుంది. ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెడితే తప్ప.. క్షేత్ర స్థాయిలో పార్టీకి బలం తేవడం కుదరే పని కాదని వైసీపీ శ్రేణుల్లో ఇంటర్నల్ డిస్కషన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది.

అమరావతి శంకుస్థాపన విషయాన్నే తీసుకుంటే.. తాను ఆ కార్యక్రమానికి అటెండ్ కాలేనని.. ఓ లేఖ రాసి… ఇక తనకేం సంబంధం లేదన్నట్టు దూరంగా ఉండిపోయారు.. జగన్. అదే టైమ్ లో.. శంకుస్థాపనకు ప్రధాని నుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రముఖులంతా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో జగన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ విషయంలో కూడా.. అధికార పార్టీ ఓ అడుగు ముందుకేసి.. జగన్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నించింది.

వైసీపీలో మరో లోపం.. అందుబాటులో ఉన్న నాయకులను సరిగ్గా వాడుకోలేకపోవడం. మైసూరా రెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి సూపర్ సీనియర్ లీడర్లు అందుబాటులో ఉన్నా.. వారి రాజకీయ అనుభవాన్ని వడపోసి తమకు అనుకూలంగా వాడుకోవడంలో కూడా పార్టీ లోపం కనిపిస్తోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే జగన్ కు దగ్గరగా ఉండే కోటరీ మాత్రమే కాదని.. అండగా ఉండే నాయకత్వాన్ని పార్టీ అందించగలుగుతోందని కేడర్ కు భరోసా ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ముందు పార్టీ కార్యకర్తల్లో నమ్మకం పెంచగలిగితే.. వాళ్లే జనంలోకి పార్టీని బలంగా తీసుకెళ్తారు. కానీ.. ఈ వాస్తవాన్ని జగన్ అండ్ కో గుర్తించినప్పుడే… వైసీపీ రాత మారే సమయం వస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -